Shocking: పోలీస్ వ్యాన్‌లోనే బర్త్ డే జరుపుకున్న ఖైదీ.. వెల్లువెత్తుతున్న విమర్శలు!

ABN , First Publish Date - 2022-08-22T20:12:35+05:30 IST

అతను ఓ హత్య కేసులో నిందితుడు.. గత నాలుగేళ్లుగా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు..

Shocking: పోలీస్ వ్యాన్‌లోనే బర్త్ డే జరుపుకున్న ఖైదీ.. వెల్లువెత్తుతున్న విమర్శలు!

అతను ఓ హత్య కేసులో నిందితుడు.. గత నాలుగేళ్లుగా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.. కేసు విచారణ నిమిత్తం కోర్టు వెలుపల పోలీస్ వ్యాన్‌లో నిరీక్షిస్తున్నాడు.. ఆ రోజు అతని జన్మదినోత్సవం కావడంతో పోలీస్ వ్యాన్ దగ్గరకే అతని అనుచరులు బర్త్ డే కేక్ పట్టుకొచ్చారు.. వ్యాన్‌లో కూర్చునే ఆ నిందితుడు కేక్ కట్ చేశాడు.. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral News)కావడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహారాష్ట్ర (Maharashtra)లోని థానేలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

ఐదేళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచార యత్నం.. సమయానికి వెళ్లి కాపాడిన లేడీ కానిస్టేబుల్..



రోషన్‌ ఝూ అనే 28 ఏళ్ల వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడు. నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కేసు విచారణ నిమిత్తం పోలీసులు అతడిని కోర్టుకు తీసుకెళుతుంటారు. శనివారం కూడా అలాగే కోర్టుకు తీసుకెళ్లారు. ఆ రోజు రోషన్ బర్త్ డే కావడంతో అతడి అనుచరులు నేరుగా పోలీసు వ్యాన్ దగ్గరకే కేక్ పట్టుకెళ్లారు. వ్యాన్ కిటికీలో నుంచి రోషన్ కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. 


రోషన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌పై థానే పోలీసు అధికారులు స్పందించారు. కేసు విచారణ నిమిత్తం అన్ని ప్రోటోకాల్స్‌ని అనుసరించి రోషన్‌ను బయటకు తీసుకువచ్చామని, నిందుతుడిని కోర్టులో హాజరుపర్చేందుకు ప్రత్యేక ఎస్కార్ట్‌ పోలీసు బృందం కూడా వెళ్లిందని తెలిపారు. నిందితుడిని తీసుకువెళ్లిన ఎస్కార్ట్‌ బృందాన్ని కూడా విచారిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

Updated Date - 2022-08-22T20:12:35+05:30 IST