అప్పు తిరిగి ఇవ్వలేదని హత్య

ABN , First Publish Date - 2022-06-26T06:31:26+05:30 IST

అప్పుగా తీసుకున్న రూ.14 వేలు తిరిగి ఇవ్వనందుకు స్నేహితుడిని రోకలి బండతో మోది హత్య చేశాడు.

అప్పు తిరిగి ఇవ్వలేదని హత్య
పరిశీలిస్తున్న పోలీసులు

మద్యం మత్తులో రోకలి బండతో మోదాడు

అనంతలో ఘటన

అనంతపురం క్రైం, జూన 25: అప్పుగా తీసుకున్న రూ.14 వేలు తిరిగి ఇవ్వనందుకు స్నేహితుడిని రోకలి బండతో మోది హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురం నగరంలోని కోవూరు నగర్‌లో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు, కోవూరు నగర్‌లో కొంతకాలంగా మహాత్మాగాంధీ నిరాశ్రయుల ఆశ్రమం (నైట్‌  షెల్టర్‌) నిర్వహిస్తున్నారు. ఇందులో అనాథలు, వృద్ధులకు ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ ఉండేవారు పగటి సమయంలో ఎక్కడ తిరిగినా, రాత్రికి ఆశ్రమానికి చేరుకుంటారు. నాలుగు నెలల క్రితం బెంగళూరుకు చెందిన అశోక్‌(40), చెన్నేకొత్తపల్లికి చెందిన శ్రీనివాసులు ఆశ్రమంలో చేరారు. వీరిద్దరూ అనంతపురం నగరంలోని హోటల్‌, గుజిరీలో పనిచేసేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం అశోక్‌కు శ్రీనివాసులు రూ.14 వేలు అప్పుగా ఇచ్చాడు. వీరు ఉంటున్న ఆశ్రమం ప్రభుత్వ నిధులతో నడుస్తోంది. బిల్లులు రాకపోవడంతో నిర్వాహకుడు ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో అశోక్‌, శ్రీనివాసులు శనివారం బయటకు వెళ్లి మద్యం సేవించారు. అశోక్‌ ఆశ్రమానికి మధ్యాహ్నం వచ్చి, పార్శిల్‌ తెచ్చుకున్న భోజనం తింటున్నాడు. అదే సమయంలో వచ్చిన శ్రీనివాసులు, అప్పుగా ఇచ్చిన సొమ్ము గురించి అడిగాడు. ుఎలాగూ ఖాళీ చేసి వెళ్లిపోతున్నాం కదా. నేను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వు్‌ అని అడిగాడు. దీంతో అశోక్‌ ునీకేం బాకీ ఉన్నాను?్‌ అని ఎదురు ప్రశ్న వేశాడు. బూతులు తిట్టాడు. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసులు.. ుడబ్బు తీసుకున్నదికాక నన్నే తిడతావా?్‌ అంటూ రోకలి బండతో అశోక్‌ తలపై మోదాడు. భోజనం చేస్తున్న అశోక్‌ అక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న నాలుగో పట్టణ సీఐ జాకీర్‌హుస్సేన, ఎస్‌ఐ గంగాధర్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే తచ్చాడుతున్న శ్రీనివాసులును, ఆశ్రమ నిర్వాహకుడు లక్ష్మీకాంతరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన వైద్యశాల మార్చురికీ తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-26T06:31:26+05:30 IST