సెక్స్ వర్కర్ హత్య! నిందితుడు ఓ యాక్టర్! పోలీసులకు ఎలా చిక్కాడో తెలిస్తే..
ABN , First Publish Date - 2020-09-27T21:55:43+05:30 IST
రష్యాలో ఇటీవల సంచలనం రేపిన సెక్స్ వర్కర్ హత్య కేసు ఆశ్చర్యకరమైన రీతిలో ఓ కొలిక్కి వచ్చింది.
మాస్కో: రష్యాలో ఇటీవల సంచలనం రేపిన సెక్స్ వర్కర్ హత్య కేసు ఆశ్చర్యకరమైన రీతిలో ఓ కొలిక్కి వచ్చింది. సదరు సెక్క్ వర్కర్‌కు చెందిన బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌పై( సైజు పెరిగేందుకు శాస్త్రచికిత్స ద్వారా వక్షోజాల్లో అమర్చే సిలికాన్ ముద్దల్ని ఇంప్లాంట్స్ అంటారు) ఉన్న సీరియల్ నంబర్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. కొద్ది రోజుల క్రితం మీగా నదీ తీరంలో చేతులూ కాళ్లూ లేని పురుషుడి మృత దేహం ఉన్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది.
మృతుడికి సంబంధించిన ఇతర వివరాలు సంపాదించడం మాత్రం వారికి కష్టమైంది. ఈలోపు.. బాధితుడి శరీరంలోని బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌పై ఉన్న సీరియల్ నంబర్‌ను వారు గుర్తించారు. దాని ఆధారంగా..ఇంప్లాట్స్‌ను అమర్చిన ఆస్పత్రికి చేరుకుని మృతుడి వివరాలను సంపాదించారు. బాధితుడి పేరు ఖతంజోనావ్ అని, అతడిని ఉబ్జెకిస్తాన్ అని వారు తెలుసుకున్నారు. అంతేకాకుండా.. అతడు వేశ్యా వృత్తిలో ఉన్నట్టు కూడా పోలీసుల విచారణలో బయటపడింది. అస్పత్రి వారు ఇచ్చిన ఇతర వివరాల ద్వారా ఖతంజోనావ్ స్నేహితులను కూడా వారు కలుసుకున్నారు. అతడు చివరిసారిగా యూరీ అనే ఓ కస్టమర్‌తో గడిపాడని, ఆ తరువాత అతడు కనిపించకుండా పోయాడని మృతుడి స్నేహితులు పోలీసులకు తెలిపారు.
ఆ తరువాత యూరీ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అతడిని తమదైన శైలిలో ప్రశ్నించగా విషయం మొత్తాన్ని బయటపెట్టేశాడు. ఖతంజోనావ్ తనపై విష ప్రయోగం చేసి దోచుకుంటాడేమోననే భయంతోనే అతడిని హత్య చేశానని చెప్పుకొచ్చాడు. అనంతరం చేతులను కోసేసి వాటిని వివిధ ప్రాంతాల్లో విసిరేసినట్టు చెప్పాడు. దీంతో వారు యూరీని అరెస్టు చేశారు. అయితే.. నిందితుడికి 15 ఏళ్లకు పైగానే జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. యూరీ సినిమాల్లో నటించేవాడని, కొన్నింటికి నిర్మాతగా కూడా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు.