44 ఏళ్ల తరువాత యువతి హంతకుని గుర్తింపు.... బయటపడిందిలా!

ABN , First Publish Date - 2021-07-18T12:00:12+05:30 IST

నాలుగు దశాబ్ధాల క్రితం యువతిపై అత్యాచారం జరిపి...

44 ఏళ్ల తరువాత యువతి హంతకుని గుర్తింపు.... బయటపడిందిలా!

వాషింగ్టన్: నాలుగు దశాబ్ధాల క్రితం యువతిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన వ్యక్తిని ఎట్టకేలకు గుర్తించారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. 1976లో నర్సింగ్ విద్యార్థి జెనెట్ స్టాల్కప్(19) హత్య జరిగింది. ఆమె మృతదేహం ఆమె కారులోని వెనుక సీటుపై లభమ్యమయ్యింది. ఆమె గొంతుపై గాయాలున్నాయి. స్నేహితురాలి బర్త్ డే పార్టీకి వెళ్లిన జెనెట్ స్టల్కప్  తన కారుతో సహా మాయమయ్యింది. అయితే తాజాగా కాలిఫోర్నియాకు చెందిన దర్యాప్తు సంస్థ... టెర్రీ డీన్ హాకిన్స్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడని గుర్తించింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారుల వినతితో హాకిన్స్ సంబంధీకుడు ఇటీవల డీఎన్ఏ శాంపిల్ ఇచ్చాడు. ఈ శాంపిల్ మ్యాచ్ అయ్యింది. జెనెట్ స్టాల్కప్ హత్య జరిగిన ఏడాది తరువాత అంటే 1977లో హాకిన్స్(23)... ఆరెంజ్ కౌంటీ జైలులో మృతి చెందాడు. అతనిని జెనెట్ స్టాల్కప్ హత్య కేసులో నిందితునిగా గుర్తించి జైలుకు తరలించారు. 


హాకిన్స్ మెకానిక్‌గా పనిచేస్తుండేవాడు. నేరాలకు కూడా పాల్పడుతుండేవాడు. అయితే ఏ కేసులోనూ హాకిన్స్ దోషిగా తేలలేదు. 1976 డిసెంబరు 19న స్నేహితురాలి పార్టీకి వెళ్లిన జెనెట్ స్టాల్కప్ అదృశ్యమయ్యింది. ఇది జరిగిన ఏడు రోజుల తరువాత కారులో ఆమె మృతదేహం లభ్యమయ్యింది. ఆమె అత్యాచారానికి గురయ్యిందని పోలీసులు నిర్ధారించారు. హాకిన్స్‌కు చెందిన జెనెటిక్ మెటీరియల్‌ను 2002లో క్రైమ్ ల్యాబ్... సంఘటనా స్థలం నుంచి సేకరించింది. ఈ డీఎన్ఏ శాంపిల్ 2020 వరకూ అజ్ఞతంగానే ఉంది. అయితే తాజాగా హాకిన్స్ కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన శాంపిల్ హాకిన్స్ డీఎన్ఏతో మ్యాచ్ అయ్యింది. ఫలితంగా జెనెట్ స్టాల్కప్‌ను హాకిన్స్ హత్య చేశాడని తేలింది.

Updated Date - 2021-07-18T12:00:12+05:30 IST