Advertisement

అంతంతే ఓటింగ్‌!

Dec 2 2020 @ 10:12AM

ఓటు హక్కును వినియోగించుకున్న కార్పొరేట్‌ అభ్యర్థులు, ప్రముఖులు 


హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి):  ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్‌లలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం ఏడు గంటలనుంచి సాయం త్రం ఆరు గంటల వరకు సాగింది. ఆరు డివిజన్‌లలో పోటీచేస్తున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ, ఎంఐఎం, సీపీఎం, టీజేఎ్‌సతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వంతంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ముఖ్యంగా ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె లక్ష్మణ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ సతీమణి బండారు వసంత, కుమార్తె విజయలక్ష్మి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణ, మాజీ డీప్యూటీమేయర్‌ గోల్కొండ రాజ్‌కుమార్‌, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నాగే్‌షముదిరాజ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు వి.శ్రీనివా్‌సరెడ్డి, బి.హేమలతారెడ్డి, జి.లాస్యనందిత, ముఠాపద్మ, ఎడ్ల భాగ్యలక్ష్మి, బింగినవీన్‌, బీజేపీ అభ్యర్థులు సునితా ప్రకా్‌షగౌడ్‌, సుప్రియా నవీన్‌గౌడ్‌, జి.రచనశ్రీ, ఏ.పావని, ఆర్‌.విశ్వం, కె.రవిచారి, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎన్‌.కవితామహేష్‌, లోకే్‌షయాదవ్‌, జంబికా కవిత, గుర్రం చంద్రకళ, వాజిద్‌హుస్సేన్‌,  పట్నం స్వప్న, టీడీపీ అభ్యర్థులు బాల్‌రాజ్‌గౌడ్‌, ఎం.చిత్ర, శోభారాణి, జహిరుద్దీన్‌ సమ్మర్‌, ఎంఐఎం అభ్యర్ధి గౌసుద్దీన్‌,  స్వతంత్ర అభ్యర్థులు శ్యామల, టీఆర్‌ఎస్‌ నగరనాయకులు ఎమ్మెన్‌ శ్రీనివా్‌సరావు, యువనాయులు ముఠాజైసింహ, న్యాయవాదుల జేఏసీ కన్వీనర్‌ పులిగారి గోవర్ధన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌లు కల్పనాయాదవ్‌, జయరాంరెడ్డి,  టి రవీందర్‌, టి.ఇందిరా, రావివెంకట్‌రెడ్డి, సరితాగోవింద్‌, టీఆర్‌ఎ్‌సనేతలు టి.సోమన్‌, రెబ్బరామారావు, సుధాకర్‌గుప్తా, బల్లా శ్రీనివా్‌సరెడ్డి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అంబర్‌పేట నియోజకవర్గంలో

బర్కత్‌పుర/నల్లకుంట/రాంనగర్‌, అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్‌ అభ్యర్థులు, మాజీ కార్పొరేటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మంగళవారం గ్రేటర్‌ ఎన్నికల ఓటింగ్‌ ముగిసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఆయన సతీమణి కావ్యకిషన్‌రెడ్డితో కలిసి ఓటు వేశారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ గోల్నాక తులసీనగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో కుమారుడు, కుమార్తెలతో కలిసి ఓటు వేశారు. ఆయన సతీమణి కాలేరు పద్మావెంకటేష్‌ మాత్రం ఓటు వేయనట్లు తెలిసింది. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్‌, జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌లీడర్‌ దిడ్డి రాంబాబు, నల్లకుంట డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గరిగంటి శ్రీదేవీ రమేష్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.జ్యోతియాదగిరిగౌడ్‌, బీజేపీ అభ్యర్థి అమృత, కాచిగూడ డివిజన్‌ బీజేపీ అభ్యర్థి కన్నె ఉమారమే్‌షయాదవ్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ బద్దుల శిరీష ఓంప్రకాష్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి బి.జయంతియాదవ్‌లు ఓట్లు వేశారు. గోల్నాక డివిజన్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి కత్తుల సరిత, బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కె.పద్మావతిదుర్గాప్రసాద్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి బి.పద్మావతివెంకటరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి శంభుల ఉషశ్రీ శ్రీకాంత్‌గౌడ్‌, అంబర్‌పేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయకుమార్‌గౌడ్‌, బీజేపీ అభ్యర్థి యశ్వంత్‌లు ఓట్లు వేశారు. 


తగ్గిన ఓటింగ్‌ శాతం 

బర్కత్‌పుర: అంబర్‌పేట నియోజకవర్గంలో గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ పూర్తయింది. నియోజకవర్గంలోని పలు మున్సిపల్‌ డివిజన్లలోని అయిదు డివిజన్లలో 50 శాతం లోపుగా పోలింగ్‌ జరగడం విశేషం. నాలుగు రోజులు వరుస సెలవులు రావడంతో చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లడం వల్ల ఓటింగ్‌ శాతం తగ్గిపోయింది. మంగళవారం సాయంత్రం 4.30 గంటల వరకు అంబర్‌పేట నియోజకవర్గంలో 39.49 శాతం ఓటింగ్‌ నమోదైంది. కాలనీలు, అపార్ట్‌మెంట్‌ వాసులు ఓటు వేయడానికి రాలేదు. కొన్ని పోలింగ్‌ బూత్‌లలో వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


పోలింగ్‌ బూత్‌లను పరిశీలించిన పోలీసు జాయింట్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి

ముషీరాబాద్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. భోలక్‌పూర్‌లోని అంజుమన్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో పోలీసు జాయింట్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ తదితర పోలీసు అధికారులు పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఎన్నికల అధికారులతో వారు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఒకే చోట పోలింగ్‌ బూత్‌లు అధికంగా ఉండడంతో తరుణ్‌జోషి స్థానిక పోలీసులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు చేశారు. 


ఓట్లు వేసేందుకు బారులుతీరిన ప్రజలు

ముషీరాబాద్‌ డివిజన్‌లోని భారత్‌ సేవా సమాజ్‌ కమ్యూనిటీహాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఉదయం 10గంటల వరకు ఓటింగ్‌ మందకోడిగా సాగినప్పటికీ 12 గంటల నుంచి పెద్దఎత్తున ఓటర్లు ఓట్లు వేసేందుకు వచ్చారు. 


గాంధీనగర్‌లో మందకొడిగా పోలింగ్‌

చిక్కడపల్లి: ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని గాంధీనగర్‌ డివిజన్‌లో పోలింగ్‌ మందకొడిగా సాగింది. డివిజన్‌లో 36.7 శాతం పోలింగ్‌ నమోదైంది. డివిజన్‌లోని 48 పోలింగ్‌ స్టేషన్‌లలో ఓటర్లు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కొన్ని పోలింగ్‌ బూత్‌లలో 60 శాతం వరకు పోలింగ్‌ జరిగినప్పటికీ చాలా బూత్‌లలో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, స్థానిక గాంధీనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా పద్మనరేశ్‌లతోపాటు కుటుంబసభ్యులు నరేశ్‌, ముఠా జైసింహ తదితరులు ఓటు వేశారు. బాపూనగర్‌ శాంతినికేతన్‌ గ్రౌండ్‌లోని పోలింగ్‌ స్టేషన్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా.కె.లక్ష్మణ్‌ తన ఓటును మొదటి గంటలోపే వేశారు. డివిజన్‌ బీజేపీ అభ్యర్థి ఎ.పావని వినయ్‌కుమార్‌ గాంధీనగర్‌లోని అభ్యుదయ హైస్కూల్‌లో, కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్రం చంద్రకళ కార్మిక కమిషనర్‌ కార్యాలయంలో ఓటు వేశారు. గాంధీనగర్‌ డివిజన్‌ ఆయా పార్టీల అభ్యర్థులతోపాటు నగర బీజేవైఎం అధ్యక్షుడు ఎ వినయ్‌కుమార్‌, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివా్‌సగుప్త, మాజీ అధ్యక్షుడు ముఠా నరేశ్‌, ఇన్‌చార్జ్‌లు వెల్లంకి ఇంద్రసేనారెడ్డి, వి.నాగభూషణంలు, గ్రేటర్‌ కాంగ్రెస్‌ నగర పాలిక సంఘటన్‌ చైర్మన్‌ గుర్రం శంకర్‌లు  పోలింగ్‌ సరళిని పరిశీలించారు.


మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకున్న విద్యార్థిని నిఖిత 

ముషీరాబాద్‌, డిసెంబర్‌ 1(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేశాను. చాలా సంతోషంగా ఉందని ముషీరాబాద్‌కు చెందిన విద్యార్థిని నిఖిత పేర్కొన్నారు. ముషీరాబాద్‌ డివిజన్‌ ఎంసీహెచ్‌ కాలనీలో గల పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలిపారు. తాను వేసిన మొదటి ఓటు బ్యాలెట్‌ పేపర్‌లో వేయడం మరచిపోలేనని పేర్కొన్నారు. 

జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో అడ్డగుట్ట డివిజన్‌లో దాదాపు 60 శాతం వరకు ఓటర్‌ స్లిప్పులు రాకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో రియో పాయింట్‌ హోటల్‌ వెనుక వైపు సీపీఎం అభ్యర్థి స్పప్న ఆధ్వర్యంలో వినూత్న ప్రయత్నం చేశారు. మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా ఓటర్‌ కార్డుపై ఉన్న ఎపిక్‌ నెంబరు సెల్‌ఫోన్‌లో సరిచూస్తే వివరాలు వస్తాయి. కానీ సెల్‌ఫోన్‌ ఓటర్‌ కేంద్రంలో అనుమతి లేకపోవడంతో ఓటర్‌ ప్రింటర్‌ ఏర్పాటు చేశారు. ఓటర్‌ సెంటర్‌ తెలియని వాళ్లకు ఈ యాప్‌ ద్వారా ఏటీఎం ప్రింట్‌ యంత్రం నుంచి స్లిప్‌ నేరుగా ఉచితంగా ఓటర్లకు అందజేశారు. ఈ ప్రయత్నం చాలా బాగుందని బాధిత ఓటర్లు ఆనందం వ్యక్తం చేశారు. 

(అడ్డగుట్ట - ఆంధ్రజ్యోతి)

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.