మష్రూమ్స్‌ సూప్‌

ABN , First Publish Date - 2020-11-04T19:48:56+05:30 IST

పుట్టగొడుగులు (మష్రూమ్స్‌) - 200 గ్రా., బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అరకప్పు, క్రీమ్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం - అర చెక్క, కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు

మష్రూమ్స్‌ సూప్‌

కావలసిన పదార్థాలు: పుట్టగొడుగులు (మష్రూమ్స్‌) - 200 గ్రా., బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అరకప్పు, క్రీమ్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం - అర చెక్క, కార్న్‌ఫ్లోర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, మిరియాల పొడి - పావు టీ స్పూను, అల్లం పేస్టు - అర టీ స్పూను.


తయారుచేసే విధానం: మష్రూమ్స్‌ శుభ్రం చేసి సన్నగా తరగాలి. కడాయిలో బటర్‌ కాగిన తర్వాత అల్లం పేస్టు వేగించి మష్రూమ్స్‌ తరుగు, ఉప్పు, మిరియాల పొడి కలిపి మూతపెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. తర్వాత స్టవ్‌ ఆపేసి, ముప్పావు వంతు మష్రూమ్స్‌ మిక్సీలో వేసి పేస్టు చేయాలి. పేస్టుని అదే కడాయిలో వేసి మూడు కప్పుల నీరుపోసి మరిగించాలి. అరకప్పు నీటిలో కరిగించిన కార్న్‌ఫ్లోర్‌ మరిగే మిశ్రమంలో కలిపి చిక్కబడ్డాక క్రీమ్‌ వేసి, నిమ్మరసం పోసి, కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్‌ చేయాలి. 

Updated Date - 2020-11-04T19:48:56+05:30 IST