638.40 అడుగులకు చేరిన మూసీ ప్రాజెక్ట్ నీటిమట్టం

ABN , First Publish Date - 2021-09-30T14:26:45+05:30 IST

మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 4 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

638.40 అడుగులకు చేరిన మూసీ ప్రాజెక్ట్ నీటిమట్టం

నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 4 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 15,193.07 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 15,424.57 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645  అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 638.40 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 2.86 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-09-30T14:26:45+05:30 IST