తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన బప్పీలహరి

Sep 21 2021 @ 10:19AM

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దక్షిణాదిని కూడా తన సంగీతంతో ఊర్రూతలూపారు సంగీత దర్శకుడు బప్పీలహరి. ఆయన స్వరపరిచిన పాటలు.. ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఎర్లియర్ గా ఆయన సంగీతం అందించిన చిత్రం గతేడాది విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘బాఘీ 3’. ఈ ఏడాది మరికొన్ని సినిమాలకి కమిట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనపై వచ్చిన ఒక రూమర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.  అనారోగ్యం కారణంగా బప్పీలహరి గొంతు దెబ్బతిందని వార్తలు వినిపించాయి. ఎన్నో సినిమాలకి సంగీతం అందించడమే కాకుండా.. తన పెక్యులర్ వాయిస్ తోనూ ఆయన ఎన్నో పాటలు పాడారు. దాంతో ఇకపై ఆయన గొంతు వినలేమేమోనని అభిమానులు ఆందోళన చెందారు. 

అయితే ఇటీవల తనపై వస్తున్న రూమర్స్ ను ఖండిస్తూ..  ఇన్ స్టా గ్రామ్ వేదికగా బప్పీలహరి స్పందించారు.  కొన్ని మీడియా ఔట్ లెట్స్ లో తన గొంతుపై వస్తున్న తప్పుడు వార్తలకు తను చాలా బాధపడుతున్నానని .. నా శ్రేయేభిలాషులు, అభిమానుల ఆశీస్సుల వల్ల తాను బాగానే ఉన్నానని తనకు ఎలాంటి అనారోగ్యం లేదని స్పష్టం చేశారు. దాంతో బప్పీలహరి అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. 

Follow Us on:

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.