
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన సంగీత దర్శకుల్లో ఎస్.ఎస్. తమన్ ఒకరు. చాలా చిత్రాలకు ఆయన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అందించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన ‘‘అల వైకుంఠపురం’ సినిమాలోని పాటలు యువతను ఉర్రూతలూగించాయి. అంతేకాదు పలు సినిమాలు, పాటలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. అయితే కాపీ కింగ్ అనే విమర్శలు కూడా తమన్‌పై ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలకు సంగీతం చేసుకుంటూ పోతున్నానని తమన్ తెలిపారు. పోటీ ప్రపంచంలో విమర్శలు సహజమని, తాను పట్టించుకోనన్నారు. ‘‘అల వైకుంఠపురం’’ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు సంగీతం అందించేందుకు చాలా కష్టపడ్డానని ఆయన పేర్కొన్నారు. ఈ వారం అతిథి తమన్‌తో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’.. మీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో...