మెట్రో స్టేషన్లలో హూ.. లలల్లా !

Published: Wed, 22 Jun 2022 08:26:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మెట్రో స్టేషన్లలో హూ.. లలల్లా !

100 మంది కళాకారులతో 25 వరకు సంగీత ప్రదర్శనలు 


హైదరాబాద్‌ సిటీ: అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్‌ అండ్‌ టీ ‘మెట్రో మెడ్లీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గోతె జెంత్రం, ఉత్కర్స్‌స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌తో కలిసి వారం రోజుల పాటు 5 మెట్రో స్టేషన్లలో సంగీతకార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, వాణిజ్యశాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మెట్రో మెడ్లీ కార్యక్రమాన్ని అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌ మెట్రో ప్రయాణికుల్లో ఆహ్లాదం నింపుతాయన్నారు. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్‌వీఎ్‌సరెడ్డి మాట్లాడుతూ సంగీతం ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తుందన్నారు. ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ నగరవాసులకు ఈనెల 25 వరకు 5 మెట్రో స్టేషన్లలో 100 మంది కళాకారులతో నిర్వహిస్తోన్న ఈ ప్రదర్శనలు ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందిస్తాయన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.