రెండు గ్రహాలపై ఉండే ప్లాన్.. చివరి ఇల్లు అమ్మకానికి పెట్టిన మస్క్!

Jun 15 2021 @ 00:24AM

కాలిఫోర్నియా: ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న టెస్లా సీఈవో ఎలన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. 169 బిలియన్ డాలర్ల సంపద ఉన్న ఈ కుబేరుడు.. తన వద్ద ఉన్న చిట్టచివరి ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ఆయన వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం బే ఏరియాలో ఉన్న ఒక్క ఇల్లు తప్ప తన పేరిట ఉన్న మిగతా ఇళ్లన్నింటినీ అమ్మేసినట్లు మస్క్ ప్రకటించారు. ఈ ఇంటిని సాధారణంగా ఈవెంట్ల కోసం అద్దెకిచ్చేవారట. ఇప్పుడు తాజాగా ఈ ఇంటిని కూడా అమ్మేయాలని డిసైడయినట్లు మస్క్ తెలిపారు. తన జీవితాన్ని రెండు గ్రహాలపై గడపడానికి అనుగుణంగా మార్చుకునే క్రమంలోనే మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.