ltrScrptTheme3

Viral Video: ఈ ముస్లిం వ్యక్తి నోట మహాభారతం.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..

Sep 23 2021 @ 15:43PM

ఎనభై, తొంబై దశకాల్లో దూరదర్శన్‌లో ప్రసారమై దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి `రామాయణ్`, `మహాభారత్` సీరియళ్లు. బీఆర్ చోప్రా నిర్మించిన `మహాభారత్` టైటిల్ సాంగ్ కూడా చాలా ప్రాచుర్యం పొందింది. ఓ ముస్లిం వ్యక్తి తాజాగా `మహాభారత్` టైటిల్ సాంగ్‌ను అద్భుతంగా ఆలపించి నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు. మాజీ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై ఖురేషి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 



`మహాభారత్` టైటిల్ సాంగ్‌ను ఆ ముస్లిం వ్యక్తి పాడిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ సాధించింది. 6900 లైక్‌లు దక్కించుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. `అద్భుతమైన గాత్రం`, `స్వచ్ఛమైన ఉచ్ఛారణ`, `మళ్లీ చిన్ననాటి రోజులను గుర్తు చేశారు` అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.