పెంచుకున్న హిందూ బాలికకు హిందూ యువకుడితో పెళ్లి చేసిన ముస్లిమ్

ABN , First Publish Date - 2021-08-02T16:49:58+05:30 IST

అనాథ హిందూ అమ్మాయిని పెంచిన ఒక ముస్లిం వ్యక్తి ఆమెకు హిందూ వరుడితో పెళ్లి జరిపించిన ఆదర్శ ఘటన....

పెంచుకున్న హిందూ బాలికకు హిందూ యువకుడితో పెళ్లి చేసిన ముస్లిమ్

విజయపుర (కర్ణాటక): అనాథ హిందూ అమ్మాయిని పెంచిన ఒక ముస్లిం వ్యక్తి ఆమెకు హిందూ వరుడితో పెళ్లి జరిపించిన ఆదర్శ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపురలో వెలుగుచూసింది. విజయపుర పట్టణానికి చెందిన మెహబూబ్ మస్లీ దశాబ్ధం క్రితం అనాథ అయిన పూజ అనే బాలికను చేరదీసి పెంచాడు. మెహబూబ్ కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నా అనాథ బాలిక అయిన పూజను చేరదీసి తన పిల్లలతో కలిసి పెంచాడు. తాను పెంచిన అనాథ అమ్మాయి పూజకు  హిందూమత సంప్రదాయాల ప్రకారం ఆమెను హిందూ వరుడితో వివాహం జరిపించాడు.


 తన ఇంట్లోనే పూజ పదేళ్లు పెరిగిందని, కానీ తాను ఆమెను ఎప్పుడూ మా ఇస్లాం మతం ఆచరించమని, ముస్లిమ్ వ్యక్తిని వివాహం చేసుకోవాలని బలవంతం చేయలేదని, ఇది తమ మత సూత్రాలకు విరుద్ధమని మెహబూబ్ చెప్పారు. హిందూ అయిన పూజను ఆమె మతానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేసిన మెహబూబ్ అందరి ప్రశంసలు అందుకున్నారు.మెహబూబ్ వేదమంత్రాల సాక్షిగా పూజ పెళ్లి జరిపించారు.‘‘నన్ను జాగ్రత్తగా చూసుకున్న గొప్ప తల్లిదండ్రులు ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను’’ అని పూజ తన కృతజ్ఞతను తెలియజేసింది.


Updated Date - 2021-08-02T16:49:58+05:30 IST