విచిత్ర రీతిలో బక్రీద్... కేక్ కట్ చేసి... పాత ఆచారాలకు స్వస్తి!

Jul 22 2021 @ 06:23AM

ఘజియాబాద్: యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన కొందరు ముస్లింలు విచిత్ర రీతిలో బక్రీద్ నిర్వహించి, సమాజానికి కొత్త ఉదాహరణను చూపించారు. కేక్‌పై పొట్టేలు ఆకారాన్ని రూపొందించి, దానిని కట్ చేసి బక్రీద్ పర్వాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా లోనీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ మాట్లాడుతూ జంతువులను బలి ఇవ్వకూడదని, త్యాగ భావాన్ని అలవరుచుకోవాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఈ పండుగను పరస్పర ప్రేమ భావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. హింసాయుత పద్ధతులకు స్వస్తి చెప్పే రీతిలో బక్రీద్ చేసుకోవాలన్నారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...