డబ్బుల్లేవ్‌

ABN , First Publish Date - 2022-06-25T07:40:26+05:30 IST

జిల్లాలో ముస్లింలను రాష్ట్రప్రభుత్వం నిలువునా మోసం చేసింది. మూ డేళ్లుగా ఊరించి ఊరించి చివరకు ఊసూరుమనిపించింది. పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు అమల్లో ఉన్న దుల్హన్‌ పథకాన్ని అమలు చేయలేమని చేతులెత్తేసింది. పథకం అమలుకు డబ్బులు లేవని నిస్సహాయత వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం తీరుపై మస్లింలు మండిపడుతున్నారు.

డబ్బుల్లేవ్‌

  • జిల్లాలో ముస్లింలను నిలువుగా దగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • దుల్హన్‌ పథకం అదిగోఇదిగో అంటూ మూడేళ్లుగా ఉత్తుత్తి మాటలు
  • తీరా ఇప్పుడు పథకం అమలుకు డబ్బుల్లేవంటూ మోసం
  • జిల్లాలో వందలాది మంది ముస్లిం యువతులకు అందని డబ్బులు
  • ప్రభుత్వంపై నమ్మకంతో ఇప్పటికే భారీగా దరఖాస్తులు: తీరా ఇప్పుడు మొండిచేయి
  • ఏడాదికి రూ.అరకోటి వరకు ఖర్చు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు
  • అటు మసీదులు, షాదీఖానాల నిర్మాణంలోను అడుగడుగునా అబద్ధాలే
  • విదేశీ విద్యలోను పిల్లిమొగ్గలే: రెండేళ్ల కిందట ఏటా రూ.80లక్షలతో అంచనాలు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ముస్లింలను రాష్ట్రప్రభుత్వం నిలువునా మోసం చేసింది. మూ డేళ్లుగా ఊరించి ఊరించి చివరకు ఊసూరుమనిపించింది. పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు అమల్లో ఉన్న దుల్హన్‌ పథకాన్ని అమలు చేయలేమని చేతులెత్తేసింది. పథకం అమలుకు డబ్బులు లేవని నిస్సహాయత వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం తీరుపై మస్లింలు మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం ఈ పథకం కింద ఇస్తున్న రూ.50వేలను రూ.లక్షకు పెంచుతామని హామీ ఇచ్చిన జగన్‌ మూడేళ్లుగా పథకాన్ని అట కెక్కించిది పోను ఇప్పుడు ఏకంగా డబ్బులే ఇవ్వలేమని చెప్పడంతో తమ ను నిలువునా మోసం చేశారని వీరంతా మండిపడుతున్నారు. జిల్లాలో ఏడాదికి 50జంటలకు అరకోటి వరకు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు గతంలో అంచనా వేశారు. ఇలా మూడేళ్లుగా కోటిన్నర ఖర్చు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. విదేశీవిద్యకు సైతం మూడేళ్లుగా రూ.2.50కోట్ల వరకు ఇవ్వకుండా పథకాన్ని నిలిపివేశారు.



నిలువునా మోసం..

జిల్లాలో ముస్లింలు అనేక మండలాల్లో ఉన్నారు. వీరిలో పేదలే ఎక్కు వ. ఈ నేపథ్యంలో ఈ కుటుంబాల్లో వివాహం చేసుకునే యువతులకు పెళ్లి కానుక కింద గత టీడీపీ ప్రభుత్వం రూ.50వేల వరకు ఇచ్చేది. దీంతో వందలాదిమంది పథకానికి దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందారు. 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ తాను అఽధికారంలోకి వస్తే దుల్హన్‌ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.లక్షకు పెంచుతానని ప్రక టించారు. దీంతో అనేకమంది జగన్‌ మాట నమ్మి ఓట్లేశారు. తీరా సీఎం అయిన తర్వాత పథకాన్ని ఏకంగా అటకెక్కించేశారు. అప్పటికే జిల్లాలో 42 యువతులు దుల్హన్‌ పథకం కోసం దరఖాస్తు చేసుకుని డబ్బులకోసం ఎదురుచూస్తున్నారు. కానీ రాష్ట్రప్రభుత్వం పథకం అమలును నిలిపివేసి ముస్లింలను దగా చేసింది. 2020 ఏప్రిల్‌ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అనేకమంది దుల్హన్‌ పథకం లబ్ధికోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆలస్యమైనా ప్రభుత్వం ఇస్తామన్న రూ.లక్ష ఇవ్వకపోదా అని ఎదురుచూస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కొన్ని వందల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం తాజాగా నాలుక మడతేసింది. అసలు ఈ పథకాన్ని అమలు చేయడానికి తమ వద్ద డబ్బులే లేవని మాట మార్చింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టుకు కూడా నివేదించింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్రప్రభుత్వం తీరుపై ముస్లింలు భగ్గుమంటున్నారు. మూడేళ్లపాటు అదిగో ఇదిగో అని నమ్మించి ఇప్పుడు నిలువునా ధగా చేయడంపై మండిపడుతున్నారు. వాస్తవానికి ఏటా జిల్లాలో ఈ పథకం కోసం వందల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం వీటన్నింటిని పక్కనపడేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తనాటికే అప్పటికే జిల్లాలో 42మంది లబ్ధిదారులను అధికారులు ఎంపికచేశారు. వీరందరికి రూ.లక్ష చొప్పున రూ.42లక్షలు ఇవ్వాలి. కానీ మొండిచేయి చూపారు.


మిగిలినవాటికీ మోసమే..

జిల్లాలో ముస్లిం విద్యార్థులు ఉన్నత చదు వులకోసం గత ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్యా పథకానికి రాష్ట్రప్రభుత్వం పంగనామాలు పెట్టింది. గతంలో వందల్లో విదేశాలకు వెళ్లి చదువుకోగా వైసీపీ అధికారంలోకి వచ్చాక దీన్ని కూడా నిలిపివేసింది. దీంతో విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం ఎందరో కోల్పోయారు. జగన్‌ సీఎం అయ్యే నాటికి ఈపథకం కింద జిల్లాలో 8మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి రూ.80లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ డబ్బులు మంజూరు కాలేదు. ఇదేకాదు జిల్లాలో ముస్లిం సోదరుల కోసం అనేక పథకాలు అమలు చేయాల్సి ఉన్నా వాటన్నింటిని జగన్‌ ప్రభుత్వం నీరుగార్చేసింది. 2019-2020 సంవత్సరానికి జిల్లాలో వక్ఫ్‌ ఇనిస్టిట్యూట్‌ డెవలప్‌మెంట్‌ కింద మసీదుల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి, ప్రహారీల నిర్మాణానికి రూ.4.15కోట్లతో అధికారు లు అంచనాలు రూపొందించారు. కానీ వీటిలో సగానికి కూడా ప్రతిపాద నలను ప్రభుత్వం ఆమోదించలేదు. రంజాన్‌ తోఫా కింద పౌరసరఫరాల సంస్థ ద్వారా ఏడాదికోసారి ఇచ్చే కిట్లను కూడా జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. 2019-2020కి జిల్లాలో 30 మసీదుల నిర్మాణానికి రూ.3.50కోట్లతో అంచనాలు రూపొందించారు. కానీ వీటికి కూడా నిధులు ఇవ్వలేదు. ఇలా ముస్లింలకు సంబంధించి అనేక పథకాలకు రాష్ట్రప్రభుత్వం మంగళం పాడి మోసం చేసింది.

Updated Date - 2022-06-25T07:40:26+05:30 IST