Mussoorie: పర్యాటకులకు షాకిచ్చిన ఉత్తరాఖండ్

ABN , First Publish Date - 2021-09-18T21:58:00+05:30 IST

ముస్సోరి: ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరిని సందర్శించాలనుకునేవారు వారాంతాల్లోనే రావాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది

Mussoorie: పర్యాటకులకు షాకిచ్చిన ఉత్తరాఖండ్

ముస్సోరి: ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరిని సందర్శించాలనుకునేవారు వారాంతాల్లోనే రావాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. గతంలో డేహ్రాడూన్‌లో సెప్టెంబరు 14 వరకు లాక్‌డౌన్‌ను విధిస్తే తాజాగా సెప్టెంబరు 21 వరకు పొడిగించామని తెలిపింది. ఈ ప్రదేశానికి వచ్చేవారు తప్పకుండా తమవెంట కొవిడ్ నెగెటివ్ రిపోర్టు తీసుకురావాలని అధికారులు తెలిపారు. 


డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ ఆర్.రాజేష్ ఈ నిబంధనలను మీడియాకు వెల్లడిస్తూ..‘‘ రెండు డోసుల టీకా తీసుకున్నవారికి కరోనా నెగెటివ్ రిపోర్టు అవసరం లేదు. వ్యాక్సిన్ వేసుకోనివారు, ఒక్క డోసు టీకా తీసుకున్నవారు తప్పకుండా రిపోర్టును తమ వెంట తీసుకురావాలి. సహస్రధార, గూచ్‌పానీలో ఉన్న చెరువులు, నదుల్లోకి పర్యాటకులను అనుమతించబోము. ప్రస్తుతం ముస్సోరిని సందర్శించాలనుకునేవారు కొవిడ్ ప్రొటోకాల్‌ను తప్పకుండా పాటించాలి. సామాజిక దూరాన్ని పాటిస్తూ తప్పకుండా మాస్కును ధరించాలి. మాల్‌రోడ్డులో సెప్టెంబరు 21 వరకు సాయంత్రం ఐదు గంటల తర్వాత వాహనాలను పార్క్ చేయకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధించడమైంది. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధిస్తాం’’ అని వివరించారు.


Updated Date - 2021-09-18T21:58:00+05:30 IST