చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2022-10-02T05:42:46+05:30 IST

చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని గోదావరిఖని సీనియర్‌సివిల్‌ జడ్జి ఆర్‌ రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి రాజ్‌కుమార్‌

- సీనియర్‌ సివిల్‌ జడ్జి రాజ్‌కుమార్‌

కోల్‌సిటీ, అక్టోబరు 1: చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని గోదావరిఖని సీనియర్‌సివిల్‌ జడ్జి ఆర్‌ రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యం లో తిలక్‌నగర్‌లోని శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వృద్ధుల ఆశ్ర మంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత పిల్లలదేనని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకువచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్దులకు పండ్లు పంపిణీ చేసి ఆశ్రమ నిర్వాహణకు రూ.3500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసి యేషన్‌ ప్రధాన కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్‌, ఆశ్రమ నిర్వాహ కులు బైసా రఘుసింగ్‌, కౌటం కిష్టయ్య, ఎస్‌ఐ కే స్వామి, న్యా యవాదులు సంజయ్‌కుమార్‌, కిషన్‌రావు, ప్రవీణ్‌ కుమార్‌, ము చ్చకుర్తి కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T05:42:46+05:30 IST