ప్లాస్టిక్‌ రహిత దుబ్బాకగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2021-06-24T04:54:17+05:30 IST

ప్లాస్టిక్‌ రహిత దుబ్బాకగా తీర్చేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ అన్నారు.

ప్లాస్టిక్‌ రహిత దుబ్బాకగా తీర్చిదిద్దాలి
దుబ్బాకలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌

దుబ్బాక, జూన్‌ 23: ప్లాస్టిక్‌ రహిత దుబ్బాకగా తీర్చేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ అన్నారు. బుధవారం దుబ్బాక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనితారెడ్డి భూంరెడ్డి ఆద్వర్యంలో జ్యూట్‌బ్యాగ్‌లను పంపిణీ చేశారు. దుబ్బాకను ప్లాస్టిక్‌ రహిత మున్సిపాలిటీగా తీర్చాలని కోరారు. తెలంగాణను ప్లాస్టిక్‌రహిత రాష్ట్రంగా తీర్చడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీలోని ప్రతీ ఇంటికి జ్యూట్‌ బ్యాగ్‌లను అందజేస్తామన్నారు. పర్యావరణం రక్షణ కోసం మొక్కలను నాటాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు ఆర్‌.రాజమౌఽళి, అదికం బాలకిషన్‌గౌడ్‌, పల్లె రామస్వామి, కౌన్సిలర్‌లు ఆస యాదగిరి, బంగారయ్య, దేవుని లలిత, నిమ్మ రజిత, మట్ట మల్లారెడ్డి, దివిటి కనకయ్య, పెంటమ్మ, ఆసీఫ్‌ పాల్గొన్నారు.


 

Updated Date - 2021-06-24T04:54:17+05:30 IST