ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి

ABN , First Publish Date - 2021-09-18T06:48:57+05:30 IST

జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి
జిల్లాకేంద్రంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు

జిల్లావ్యాప్తంగా విమోచన దినోత్సవం
నల్లగొండ రూరల్‌ / నల్లగొండ క్రైం / నల్లగొండ, సెప్టెంబర్‌ 17 :
జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలు ఎగురవేయడంతో అమరులను స్మరించుకుని నివాళులర్పించారు. జిల్లాకేంద్రంలోని దొడ్డికొమరయ్య భవనంలో  సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు పాలడుగు ప్రభావతి, దండెంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, మైల యాదయ్య, అద్దంకి నర్సింహ, భూతం అరుణ, గుండాల నరేష్‌, సత్యనారాయణ, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయం ముగ్దుం భవనలో పార్టీ సీనియర్‌ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సత్యం మాట్లాడుతూ భూ మి కోసం,భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్‌, పబ్బు వీరస్వామి, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి తిరుప్పరి వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి గదేపాక రమేష్‌, పద్మ, లెనిన, సుర్గి చలపతి, చాపల శ్రీను పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని శ్రామిక భవనలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు ఇందూరు సాగర్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఎనజీ కళాశాల ఎదుట ఏబీవీపీ నాయకులు జాతీయ జెండా ఆవిష్కరించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నియోజకవర్గ ఇనచార్జి తుమ్మల మధుసూదనరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్వీ.యాదవ్‌, పార్లమొంట్‌ వాణిజ్య సెల్‌ అధ్యక్షుడు కూరెళ్ల విజయ్‌కుమార్‌, ఇస్తారి, గుండు వెంకటేశ్వర్లు, చంద్రబాబు, సిద్దిక్‌ పాల్గొన్నారు. వేములపల్లి మండలంలో జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో సాయుధ పోరాట యోధులను సన్మానించారు.



Updated Date - 2021-09-18T06:48:57+05:30 IST