కార్పొరేట్‌ విధానాలపై రాజీలేని పోరాటంచేయాలి

ABN , First Publish Date - 2022-05-20T05:20:05+05:30 IST

కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్‌ కే.హేమలత పిలుపునిచ్చారు. ఒంగోలులో నూతనంగా నిర్మించిన సీఐటీయూ జిల్లా భవనాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ద్వారా దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు

కార్పొరేట్‌ విధానాలపై రాజీలేని పోరాటంచేయాలి
సీఐటీయూ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్‌ హేమలత

సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 19: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్‌ కే.హేమలత పిలుపునిచ్చారు. ఒంగోలులో నూతనంగా నిర్మించిన సీఐటీయూ జిల్లా భవనాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ద్వారా దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, ప్రభుత్వ రంగ ఆఫీసులు మొత్తం ధారాదత్తం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ విధానాలను కార్మిక వర్గం ముక్తకంఠంతో నిరసించాలని పిలుపునిచ్చారు. కనీసవేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాల్సి ఉండగా ఎక్కడ అమలు జరగడం లేదన్నారు. అసంఘటిత కార్మిక వర్గంపై నిర్బంధం విధించడం దారుణంగా ఉందన్నారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాడాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసరెడ్డి, సీఐటీయూ నేతలు సిద్దయ్య, సుబ్బరావమ్మ, నాయకులు కే.శరత్‌బాబు, పీవీఆర్‌ చౌదరి, వీరస్వామిరెడ్డి, జాలా అంజయ్య, కంకణాల ఆంజనేయులు, జీవీ కొండారెడ్డి, ఎస్‌కే మున్వర్‌సుల్తానా, కల్పన, అన్నపూర్ణ, మహేష్‌, చీకటి శ్రీనివాసరావు, రమేష్‌, రఫి, జి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. 

 

Updated Date - 2022-05-20T05:20:05+05:30 IST