భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి

ABN , First Publish Date - 2021-03-01T04:44:39+05:30 IST

భావి శాస్త్రవేత్తలుగా విద్యార్థులు ఎదగాలని, దేశానికి సేవ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి వీరారెడ్డి ఆకాంక్షించారు.

భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న కమిషనర్‌, ఎంఈఓలు

పులివెందుల టౌన, ఫిబ్రవరి 28: భావి శాస్త్రవేత్తలుగా విద్యార్థులు ఎదగాలని, దేశానికి సేవ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి వీరారెడ్డి ఆకాంక్షించారు. నగరిగుట్ట ఎస్సీ హాస్టల్‌లో సర్‌ సివి రామన ఎఫెక్ట్‌ ఆవిష్కరణ దినోత్సవం పురస్కరించుకు ని సైన్స దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

వారు మాట్లాడుతూ మానవుని పురోభివృద్ధి సైన్స మీదే ఆధారప డి ఉందని ప్రతి ఒక్క ఆవిష్కరణ మన దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతోందన్నారు. అనంతరం రూపొందిం చిన ఉత్తమ నమూనాలకు బహుమతులు అందించారు. ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణరెడ్డి, వార్డన విక్టర్‌, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

సింహాద్రిపురం, ఫిబ్రవరి 28: జాతీయ సైన్స దినోత్సవం సందర్భంగా ఆదివారం సింహాద్రిపురం జడ్పీ ఉన్నత పాఠ శాల ప్రధానోపాధ్యాయుడు చిట్టిబాబు ఆధ్వర్యంలో విద్యా ర్థులు నమూనాలు ప్రదర్శించారు. సైన్స జాతీయ దినోత్స వం గురించి విద్యార్థులకు వివరించారు. విజేతలకు బహు మతులు పంపిణీ చేశారు. సైన్స ఉపాధ్యాయులు బాస్కర్‌ రెడ్డి, మమత, ప్రతాప్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

బద్వేలు, ఫిబ్రవరి28: రాచపూడి నాగభూషణం డిగ్రీ, పీజీ, బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలల ఎనఎ్‌సఎ్‌స యూనిట్‌ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ సైన్స దినోత్సవా లు నిర్వహించారు. విద్యార్థులు సర్‌ సి.వి.రామన చిత్రపటానికి నివాళులర్పించారు.

రాచపూడి కళాశాల పరిపాలనాధికారి సాయిక్రిష్ణ, ప్రిన్సిపల్‌ సత్యనారాయణ, వీరారెడ్డి కళాశాల ఎనఎ్‌సఎ్‌స సమన్వయ అధికారి డాక్టర్‌ కె.వెంకటరావు, బోటనీ అధ్యాపకులు ఎస్‌.సంటెయ్య, కెమిస్ర్టీ అఽధ్యాపకులు డాక్టర్‌ సుబ్బారెడ్డి , జువాలజి అధ్యాపకురాలు మౌనిక, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:44:39+05:30 IST