ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2022-06-29T04:37:52+05:30 IST

యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గతంలో పోలిస్తే ఇప్పుడు అభ్యర్థులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకుని కొలువులు దక్కేలా కృషి చేయాలని తెలిపారు. తమపై తాము గట్టి నమ్మకంతో కష్టపడ్డప్పుడే విజేతలవుతారని పేర్కొన్నారు. కొన్ని సాధించడానికి కొన్ని త్యాగం చేయక తప్పదన్నారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌28: యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గతంలో పోలిస్తే ఇప్పుడు అభ్యర్థులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకుని కొలువులు దక్కేలా కృషి చేయాలని తెలిపారు. తమపై తాము గట్టి నమ్మకంతో కష్టపడ్డప్పుడే విజేతలవుతారని పేర్కొన్నారు. కొన్ని సాధించడానికి కొన్ని త్యాగం చేయక తప్పదన్నారు. యువత చెడు అలువాట్లకు దూరంగా ఉంటూ, మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగాలని సూచించారు. పోటీ పరీక్షలంటే భయం, అపోహాలు ఎక్కువ అని, వాటితో పాటు వాయిదా వేయడం, బద్దకం, ఆ త్మన్యూనత భావం, మొహమాటం విడిచిపెట్టాలని అన్నారు. తమపై తాము నమ్మకం పెంచుకోవాలని సూచించారు. పరీక్షల్లో ప్రతీ ప్రశ్న, ప్రతీ మార్కు కీలకమన్నారు. ఏకాగ్రత, స్థిరత్వంతో విషయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయకుండా, కర్తవ్యాన్ని నిర్వర్తించడంపైనే యువత దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వస్తున్న నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రూపు-1, ఎస్సై, కానిస్టేబుల్‌ నోటిఫికేషన్లు వచ్చాయని, త్వరలోనే గ్రూపు 2, 4 ఇతర ఉద్యోగ ప్రకటనలు కూడా రానున్నాయని అన్నారు. కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఎస్సీ, బీ సీ, మైనార్టీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు స్టడీ మెటిరియల్‌ కూడా అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అ దనపు కలెక్టర్లు రిజ్వాన్‌ భాషాషేక్‌, ఎన్‌.నటరాజ్‌, ఆర్డీవో రమేష్‌రాథోడ్‌, జిల్లా పరిషత్‌ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T04:37:52+05:30 IST