పట్టుదలతో చదివి విజయం సాధించాలి

ABN , First Publish Date - 2022-05-14T04:20:43+05:30 IST

విద్యార్థులు పట్టుదలతో చదివి పరీక్షల్లో విజయం సాధిం చాలని డీసీపీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. వేంపల్లిలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ట్రస్మా ఆద్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. పదో తర గతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించా లన్నారు. తాను విద్యార్థి దశలో ఎంతో కష్టపడి ప్రతి పరీక్షలో విజయం సాధించి ఈ స్ధాయికి ఎదిగినట్లు వివరించారు. పదో తరగతి విద్యార్థులకు కీలక దశ అని తెలిపారు.

పట్టుదలతో చదివి విజయం సాధించాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అఖిల్‌ మహాజన్‌

హాజీపూర్‌, మే 13: విద్యార్థులు పట్టుదలతో చదివి పరీక్షల్లో విజయం సాధిం చాలని డీసీపీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. వేంపల్లిలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ట్రస్మా ఆద్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. పదో తర గతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించా లన్నారు. తాను విద్యార్థి దశలో ఎంతో కష్టపడి ప్రతి పరీక్షలో విజయం సాధించి ఈ స్ధాయికి ఎదిగినట్లు  వివరించారు. పదో తరగతి విద్యార్థులకు కీలక దశ అని తెలిపారు. అనంతరం వ్యక్తిత్వ వికాస నిపుణుడు వేణుకళ్యాణ్‌ శాస్ర్తీ విద్యార్థులు ఎలా చదవాలో తెలిపారు. సృజనాత్మకత, పరీక్షలంటే భయం పొగొట్టడం, కార్యా చరణలో మెళకువలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రాముఖ్యతపై విద్యార్థు లకు అవగాహన కల్పించారు. ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొ న్నారు. అనంతరం ట్రస్మా ఆధ్వర్యంలో డీసీపీ అఖిల్‌ మహా జన్‌, వ్యక్తిత్వ వికాస నిపుణుడు వేణుకళ్యాణ్‌ను సన్మానించారు. జిల్లా ట్రస్మా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్‌రావు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, కోశాధికారి శరత్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, కరెస్పాండెంట్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

Read more