ఆ కాంట్రాక్టరుపై చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2021-06-17T04:55:52+05:30 IST

అంగన్‌వాడీలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టరుపై చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి సీడీపీవో శాంతిదుర్గ చెప్పారు.

ఆ కాంట్రాక్టరుపై చర్యలు తప్పవు
ఏర్పేడు అంగన్‌వాడీ కేంద్రంలో కోడిగుడ్లను పరిశీలిస్తున్న సీడీపీవో శాంతిదుర్గ

ఏర్పేడు, జూన్‌ 16: మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేసిన కాంట్రాక్టరుపై చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవో శాంతిదుర్గ స్పష్టం చేశారు. ‘అంగన్‌వాడీలకు కుళ్లిన కోడిగుడ్లు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. దీంతో ఏర్పేడు దళితవాడ, మేర్లపాక, సీతారాంపేట అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి కోడిగుడ్లను పరిశీలించారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు, గర్భవతులు, బాలింతలతో సమావేశమై సక్రమంగా కోడిగుడ్లు, పౌష్టికాహారం అందుతున్నాయా అని ఆరాతీశారు. ఈనెల తొలివిడతగా కుళ్లిన గుడ్లు పంపిణీ చేయడంతో పడేసినట్లు పలువురు తెలిపారు. ఇకపై నాణ్యమైనవి సరఫరా అయ్యేలా చూస్తామని సీడీపీవో హామీఇచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నాగమణి, అంగన్‌వాడీ కార్యకర్త అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T04:55:52+05:30 IST