ఈ నెల చివరి వరకు రికవరీ చేయాలి

ABN , First Publish Date - 2021-09-17T05:13:29+05:30 IST

స్త్రీనిధి నుంచి స్వ యం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తున్నాము కానీ, రికవరీలో వెనుకబడ్డామని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు పేర్కొన్నారు.

ఈ నెల చివరి వరకు రికవరీ చేయాలి
అధికారులతో సమీక్షిస్తున్న డీఆర్‌డీఏ పీడీ యాదయ్య, అధికారులు

- రూ. 95 కోట్ల టార్గెట్‌కు గాను రూ.17 కోట్ల రుణవితరణ 

- మొండి బకాయిలు రూ.5 కోట్ల 69 లక్షలు

- నేడు కొవిడ్‌ టీకాపై అవగాహన కోసం గ్రామాల్లో ర్యాలీలు

-  స్ర్తీ నిధి రుణాలు, రికవరీ, కొవిడ్‌ టీకా పై  వెబెక్స్‌ ద్వారా సమీక్షించిన కలెక్టర్‌  వెంకట్రావు


మమబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), సెప్టెంబరు 16 : స్త్రీనిధి నుంచి స్వ యం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తున్నాము కానీ, రికవరీలో వెనుకబడ్డామని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు పేర్కొన్నారు. ఈ నెల చివరి వ రకు రుణవితరణ (స్ర్తీ నిధి రుణాలు ఇవ్వడం)తో పాటు మొండి బకా యిలు (రికవరీ) వసూలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గురువారం ఆయన స్ర్తీ నిధి రుణాలు, రికవరీ, కొవిడ్‌ టీకాపై డీఆర్‌డీఏ పీడీ, ఏపీడీ, స్ర్తీ నిధి, ఏపీఎం, సీసీ, టీఎంసీ తదితర శాఖల అధికారులతో వెబెక్స్‌ ద్వారా కలెక్టర్‌ సమీక్షించారు. స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం అందించాల్సిన రుణాలు రూ.95 కోట్ల 37 లక్షలకు గాను ఇప్పటి వరకు రూ. 17 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. మొండి బకాయిలు రూ.5 కోట్ల 69 లక్షలు వసూలు చేయడంలో వెనుకున్నామని సంబందిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 శాతం రెగ్యులర్‌ వసూళ్లు చేయాల్సి ఉందని చెప్పారు. రుణవితరణతో పాటు ఈ నెల చివరి వరకు రికవరీ, మొండి బకాయిలు వసూలు చేయాల్సిన బాధ్యత ఏపీఎం, సీసీ ల దేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కొత్త పథకాలైన డెయిరీ, పెరటి కోళ్లు, టూ వీలర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మదర్‌ యూనిట్లపై సంఘాలకు అవగాహ న కల్పించి ఆవసరమైన వారికి రుణాలు ఇప్పించాలన్నారు. 18 ఏళ్లకు పైబడిన వారందరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునేవిధంగా ప్రతీ గ్రామంలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, స్వయం సహాయక సంఘాలు సమన్వయంగా శుక్రవారం అవగాహన రాలీలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం డీఆర్‌డీఏ పీడీ యాదయ్య, ఏపీఎం, సీసీ, టీఎంసీలతో సమీక్షించారు. కార్యక్రమంలో ఏపీడీ శారద, స్ర్తీ నిధి జోనల్‌ అధికారిని సంఽధ్య, ఆర్‌ఎం శివప్రసాద్‌, ఏపీఎం, సీసీ, టీఎంసీలు, మహిళా సమాఖ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T05:13:29+05:30 IST