శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలి

ABN , First Publish Date - 2021-07-23T06:28:08+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణలో జవాన్‌లు ముందుండాలని ఐజీ శివశంకర్‌రెడ్డి సూచించారు. గురువారం డిచ్‌పల్లిలోని 7వ పోలీసు బెటాలియన్‌లో 9నెలల శిక్షణ పూర్తిచేసుకున్న 371 మంది దీక్షాంత్‌ పరేడ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తిచేసుకున్న జవాన్‌ల గౌరవ వం దనం స్వీకరించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలి
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఐజీ శివశంకర్‌రెడ్డి

జవాన్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఐజీ శివశంకర్‌రెడ్డి
డిచ్‌పల్లి, జూలైౖ 22: శాంతిభద్రతల పరిరక్షణలో జవాన్‌లు ముందుండాలని ఐజీ శివశంకర్‌రెడ్డి సూచించారు. గురువారం డిచ్‌పల్లిలోని 7వ పోలీసు బెటాలియన్‌లో 9నెలల శిక్షణ పూర్తిచేసుకున్న 371 మంది దీక్షాంత్‌ పరేడ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తిచేసుకున్న జవాన్‌ల గౌరవ వం దనం స్వీకరించారు. ఈ సందర్భంగా శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీ ఆర్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అధునాతన పోలీసు వ్యవస్థీకరణ కో సం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని, పోలీసులకు సెలవులు కూ డా ఆన్‌లైన్‌లోనే లభిస్తున్నాయన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న జవాన్‌లు శక్తివంచన లేకుండా పనిచేసి 7వ బెటాలియన్‌ పేరును మరింత ఇనుమడింప చేయాలన్నారు.  అనంతరం కమాండెంట్‌ సత్య శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 13 బ్యాచ్‌లకు తమ బెటాలియన్‌లో శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పూర్తి చేసుకు న్న జవాన్‌లందరు అంకితభావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీ సు అధికారులు రమణ, విష్ణుమూర్తి, అనిల్‌కుమార్‌, ఆంజనేయరెడ్డి, వెంకటేశ్వ ర్లు, రామకృష్ణ, ప్రహ్లాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-23T06:28:08+05:30 IST