నియమ నిబంధనలు అర్థం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-03-01T04:40:53+05:30 IST

పీవో, ఏపీవోలు పోలింగ్‌ నియమ నిబంధనలను సంపూర్ణంగా అర్థం చేసుకొని అమలు చేస్తేనే మండలి ఎన్నికలను సజావుగా నిర్వహించవచ్చని జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ అన్నారు.

నియమ నిబంధనలు అర్థం చేసుకోవాలి
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌

నాగర్‌కర్నూల్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పీవో, ఏపీవోలు పోలింగ్‌ నియమ నిబంధనలను సంపూర్ణంగా అర్థం చేసుకొని అమలు చేస్తేనే మండలి ఎన్నికలను సజావుగా నిర్వహించవచ్చని జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ అన్నారు. బాబుజ గ్జీవన్‌రాం సమావేశ మందిరంలో ఆదివారం పీవో, ఏపీవోలకు మండలి ఓటింగ్‌ నియమ నిబంధన లపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పీవో, ఏపీ వోలు తమకు పోలింగ్‌ నిర్వహణపై అణువంతా అనుమానం ఉన్నా ఇక్కడే నివృత్తి చేసుకోవాలని తెలియజేశారు. ఇప్పటికే అనేక ఎన్నికలు నిర్వ హించిన అనుభవాలు పొంది ఉన్నారని, ఇక్కడ శిక్షణ ఇస్తున్న మాస్టర్‌ ట్రైనర్లు సైతం ఎంతో అనుభవం కలిగి ఉన్న వారు. కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చే సుకొని పోలింగ్‌ రోజు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాలని పలు సూచనలు, సలహాలు చేశారు.  అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, డీఈవో గోవిందరాజులు, డీఎస్‌వో మోహన్‌, మాస్టర్‌ ట్రైనర్లు, పీవో, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు. 

 నేటి నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి టీకా

  కరోనా మహమ్మారి నివారణకు రా ష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో నాగ ర్‌కర్నూల్‌ జిల్లాలో సోమవారం నుంచి 60ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ ఆదివారం విలేకరులకు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి 45ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు అందజేయనున్న రెండవ దశ టీకాతోపాటు 60ఏళ్ల పైబడిన సాధారణ ప్రజలకు సోమవారం నుంచి టీకాను ఇ వ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకుగాను లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోలేకపోయినా ఆన్‌సైట్‌ సిస్టం ద్వారా కొవిడ్‌ టీకా వేయించుకోవాలన్నారు. నేరుగా కొవిడ్‌ టీకా కేంద్రానికి వెళ్లి ఆధార్‌కార్డు, ఓటర్‌ కార్డు, డ్రైవింగ్‌లైసెన్సు, దీర్ఘకా లిక జబ్బులున్నట్లు వైద్యుడి సర్టిఫికెట్‌, మరేదైనా అధికారిక గుర్తింపు కార్డు ఉన్నట్లు చూపిస్తే టీకా వేస్తారన్నారు. అయితే ఆ రోజు రద్దీని బట్టి కొవిడ్‌ నిబంధనల మేరకు ఆన్‌సైట్‌ వారికి టీకా వేస్తారన్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకుని వెళ్లడం మంచిదని కలెక్టర్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న ఐడీని తప్పనిసరిగా ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నారు. టీకాకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు.  


Updated Date - 2021-03-01T04:40:53+05:30 IST