ltrScrptTheme3

అవినీతికి వ్యతిరేకంగా పని చేయాలి

Oct 26 2021 @ 23:41PM
ఏసీబీ అధికారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి

ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి 

విజిలెన్స్‌ వారోత్సవాలు ప్రారంభం

ఏసీబీ కార్యాలయంలో ప్రతిజ్ఞ

నేడు మార్కాపురంలో అవగాహన సదస్సు


ఒంగోలు(క్రైం), అక్టోబరు 26 : అవినీతిరహి త సమాజం ప్రతి ఒక్కరూ పని చేయాలని అవి నీతి నిరోధకశాఖ (ఏసీబీ) డీఎస్పీ ఎం.సూర్యనా రాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు జరిగే విజిలెన్స్‌ వారో త్సవాల్లో భాగంగా మంగళవారం ఒంగోలులోని ఏసీబీ కార్యాలయంలో సిబ్బందితో ఆయన ప్రతి జ్ఞ చేయించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడు తూ అవినీతిని నిరోధించేందుకు రూపొందించిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. అలాగే ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా ఉద్యోగులు ప్రతిన పూనాలని కోరారు. అలాగే వి జిలెన్స్‌ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మా ర్కాపురం సౌజన్య కళ్యాణ మండపంలో అవగా హన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో అ వినీతిపై పౌరుని పాత్ర అనే అంశం మీద వక్తృ త్యం పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అన్ని శాఖల అధికా రులు పాల్గొంటారన్నారు. అలాగే ఆయా కార్యా లయాల్లో ఉన్న పౌరసేవలు వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నా రు. వచ్చే నెల 1 వరకు వివిధ కార్యక్రమాలు ని ర్వహిస్తామని డీఎస్పీ వివరించారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.