ఆవాలతో నొప్పులు మాయం!

ABN , First Publish Date - 2021-02-24T06:04:51+05:30 IST

ఆవాలను, ఆవ పిండిని రకరకాల వంటకాల్లో వేసుకుని తినడం అందరికీ తెలిసిందే. అయితే ఇవి శరీర లోపలి ఆరోగ్యానికి ఎంత మంచివో, శరీరం పైభాగంలో తలెత్తే రకరకాల నొప్పులు, అలసిన కండరాలకు మంచి మందులా పని చేస్తాయంటున్నారు...

ఆవాలతో నొప్పులు మాయం!

ఆవాలను, ఆవ పిండిని రకరకాల వంటకాల్లో వేసుకుని తినడం అందరికీ  తెలిసిందే. అయితే ఇవి శరీర లోపలి ఆరోగ్యానికి ఎంత మంచివో, శరీరం పైభాగంలో తలెత్తే రకరకాల నొప్పులు, అలసిన కండరాలకు మంచి మందులా పని చేస్తాయంటున్నారు భారత సంప్రదాయ వైద్య నిపుణులు. స్నానం చేసే ముందు నీళ్లల్లో రెండు టేబుల్‌స్పూన్ల  ఆవ పొడితో పాటు కొద్దిగా ఎప్సమ్‌ సాల్ట్‌ను నీళ్లలో వేసి  ఆ నీళ్లతో స్నానం చేస్తే నొప్పులు పోతాయి. ఆవాల్లో ఉండే సల్ఫర్‌ శరీరంపై చర్మ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. నొప్పి, వాపును తగ్గిస్తుంది. చర్మంలో రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. కీళ్ల నొప్పులు, కండరాల అలసట నుంచి సాంత్వన పొందుతారు.    

Updated Date - 2021-02-24T06:04:51+05:30 IST