మన్యంలో ముసురు

ABN , First Publish Date - 2021-10-17T06:06:45+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మన్యంలో రెండు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది.

మన్యంలో ముసురు
వర్షానికి తడిచిముద్దయిన పాడేరు అంబేడ్కర్‌ సెంటర్‌



అల్పపీడన ప్రభావంతో వర్షాలు

పాడేరు, అక్టోబరు 16: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మన్యంలో రెండు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో దసరా ఉత్సవాలకు ఆటంకం ఏర్పడింది. అలాగే శనివారం మధ్యాహ్నం నుంచి జల్లులతో కూడిన వర్షం కురుస్తునే ఉంది. దీంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ముసురు వల్ల జన జీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. అయితే మరో రెండు రోజులు అల్పపీడనం కొనసాగుతుందనే వాతావరణ శాఖ సూచనలతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈవర్షాలు మెట్ట పంటలకు మేలు చేస్తాయని రైతులు అంటున్నారు.

Updated Date - 2021-10-17T06:06:45+05:30 IST