పోలీసుల అదుపులో రెమ్‌డిసివిర్‌ ముఠా..?

ABN , First Publish Date - 2021-05-09T06:04:21+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న రెమ్‌డిసివిర్‌ టీకా బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతోంది. ఒ క్కొక్కటి రూ.15 వేల నుంచి రూ. 30 వేల వరకు విక్రయించి, సొ మ్ము చేసుకుంటున్నారు. ఇదే విషయం ఇటీవల విజిలెన్స దాడుల్లో బహిర్గతమైంది.

పోలీసుల అదుపులో రెమ్‌డిసివిర్‌ ముఠా..?

ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ముగ్గురు ఆస్పత్రి 

ఉద్యోగులు, ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తులుగా గుర్తింపు..!

14 రెమ్‌డిసివిర్‌ టీకాల స్వాధీనం 

అనంతపురం క్రైం, మే 8: కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న రెమ్‌డిసివిర్‌ టీకా బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతోంది. ఒ క్కొక్కటి రూ.15 వేల నుంచి రూ. 30 వేల వరకు విక్రయించి, సొ మ్ము చేసుకుంటున్నారు. ఇదే విషయం ఇటీవల విజిలెన్స దాడుల్లో బహిర్గతమైంది. తాజాగా శనివారం ఏడుగురితో కూడిన ముఠా నగరంలోని కమలానగర్‌లో టీకాను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తుండగా నగరంలోని వనటౌన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన ముఠా సభ్యుల నుంచి 14 రెమ్‌డెసివిర్‌ టీకాలను స్వాధీనం చేసుకున్న ట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. పట్టుబడిన ముఠాలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్సులు, సర్వ జనాస్పత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులు, మరో ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తులు ఉండటం చర్చనీయాంశంగా మా రింది. దీంతో పోలీసులు లోతుగా వి చారిస్తున్నారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. దీంతో ఆయా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇంజక్షన్ల విక్రయాలు వెనుక ఎవరెవరి హస్తం ఉంది...? ఇప్పటి వరకు ఎన్ని విక్రయించారు? ఎక్కడి నుంచి తెచ్చారు..? తదితర అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఏదైనా ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి పక్కదారి పట్టించి, బ్లాక్‌ మార్కెట్‌లో ఈ ముఠా ద్వారా విక్రయిస్తున్నారా..? అనే అనుమానాలు లేకపోలేదు. ఏది ఏమైనా రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్ల ముఠా పోలీసులకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.


Updated Date - 2021-05-09T06:04:21+05:30 IST