మువ్వన్నెల జెండా రెపరెపలు

ABN , First Publish Date - 2022-08-16T06:46:24+05:30 IST

76వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడు కలు సోమవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు.

మువ్వన్నెల జెండా రెపరెపలు
కలెక్టర్‌ బంగ్లాలో జాతీయ జెండాకు వందన సమర్పణ చేస్తున్న కలెక్టర్‌

కన్నుల పండువగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కర్నూలు(కల్చరల్‌), ఆగస్టు 15:  76వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడు కలు సోమవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన దేశభక్తులను, త్యాగమూర్తులను స్మరిం చుకొని వారికి నివాళి అర్పించారు. నగరంలోని వివిధ  ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు కేజీ గంగాధరరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ప్రకాశ్‌, లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి, గ్రంథాలయ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. క్లస్టర్‌ యూనివర్శిటీలో జాతీయ పతాకాన్ని వర్శిటీ ఉపకులపతి ఆచార్య డీవీఆర్‌ సాయిగోపాల్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో క్లస్టర్‌ వర్శిటీ అను బంధ కళాశాలలైన కేవీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు డాక్టర్‌ వీవీఎస్‌ కుమార్‌, డాక్టర్‌ ఇందిరాశాంతి, డాక్టర్‌ పి. కళావతి పాల్గొన్నారు. ఉస్మానియా కళాశాలో ప్రిన్సిపాల్‌ సమీఉద్దీన్‌ ముజ్జమీల్‌ జెండాను ఆవిష్కరించారు. ఎన్‌సీసీ విద్యార్థుల ర్యాలీ ఆకట్టుకుంది. సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కళాశాల్లో  సామాజికవేత్త డాక్టర్‌ సురేంద్రనాథ్‌  పతాకాన్ని ఆవిష్కరించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగేంద్రనాథ్‌, సెయింట్‌ జోసెఫ్స్‌ విద్యాసంస్థల అధినేత్రి రోజమ్మ, కరస్పాండెంట్‌ అనూప్‌ చిత్తరంజన్‌, ప్రిన్సిపాల్‌ ఐశ్వర్య తదితరులు పతాక ఆవిష్కరణలో పాల్గొన్నారు.

కర్నూలు(న్యూసిటీ):
కర్నూలు నగర రూపురేఖలు తీర్చిదిద్దుతామని నగర మేయర్‌ బీవై. రామయ్య అన్నారు. సోమవారం 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నగర పాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కోడుమూరు ఎమ్మెల్యే డా.జే.సుధాకర్‌, కమిషనర్‌ ఏ.భార్గవతేజ పాల్గొని స్వాతంత్య్ర  సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి త్రివర్ణ పతా కాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ  మేయర్‌ సిద్ధారెడ్డి రేణుక, అదనపు కమిషనర్‌ రామలింగేశ్వర్‌, డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌వి.రమాదేవి పాల్గొన్నారు.
ఫ జిల్లా పరిషత్‌ పరిపాలన భవనంలో జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎం.వెంక టసుబ్బయ్య, డిప్యూటి సీఈఓ టీవి.భాస్కర్‌నాయుడు, డీఎల్‌డీఓ శివశంకర్‌, చైర్మన్‌ సీసీ అశ్వినికుమార్‌ పాల్గొన్నారు.

కర్నూలు(అర్బన్‌): జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు  సుధాకర్‌ బాబు జెండాను ఎగుర వేశారు.  సిటీ అధ్యక్షుడు జాన్‌ విల్సన్‌, ఉపాధ్యక్షులు పెద్దా రెడ్డి, అశోకరత్నం, కె బాబురావు పాల్గొన్నారు.

కర్నూలు(కలెక్టరేట్‌):
76వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ బంగ్లాలో జాతీయ జెండాను కలెక్టర్‌ కోటేశ్వరరావు ఆవిష్కరించారు. పెరియడ్‌ మైదానంలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల కంటే ముందుగా కలెక్టర్‌ బంగ్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఫ నాలుగు సింహాల స్థూపాన్ని ప్రారంభించిన కలెక్టర్‌:  కలెక్టరేట్‌ ఆవరణ లో ఏర్పాటు చేసిన నాలుగు సింహాల స్థూపాన్ని  కలెక్టర్‌ కోటేశ్వరరావు ప్రారంభించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. రామసుందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమి ష నర్‌ భార్గవతేజ, జిల్లా రెవోన్యూ అధికారి నాగేశ్వరరావు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్‌రెడ్డి, జివి.రమణకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.  స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని సమాచార పౌరసంబంధాల శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో ఆశాఖ  డీడీ జయమ్మ జాతీ య జెం డాను ఎగురవేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంపైన జాతీయ జెండాను జాయింట్‌ కలెక్టర్‌ రామ సుందరరెడ్డి ఎగురవేశారు. ఆయనతో పాటు డిఆర్వో నాగేశ్వరరావు, కలెక్టరేట్‌ ఏవో వెంకటేష్‌, కలెక్టరేట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   ఏపీ ఎన్‌జీవోస్‌ హోంలో జిల్లా అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి జాతీయ జెం డాను ఎగురవేసి, వందన సమర్పణం చేశారు. కార్యక్రమంలో ఎపీఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి జవహర్‌లాల్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రామకృ ష్ణారెడ్డి, సిటీ అధ్యక్షుడు కాశన్న, పాల్గొన్నారు.

కర్నూలు(లీగల్‌):
స్థానిక జిల్లా కోర్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.శ్రీనివాసకుమార్‌ జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు జిల్లా కోర్టులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి న్యాయమూర్తులంతా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు ప్రతిభాదేవి, సత్యవతి, భూపాల్‌ రెడ్డి, సీనియర్‌ సివిల్‌ జడ్జీలు పాండురంగారెడ్డి, సీహెచ్‌ వెంకట నాగ శ్రీనివాసరావు, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు జ్యోత్స్న దేవి, షర్మిల, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ బీటీ అనురాధ, బార్‌ అసో సియేషన్‌ అధ్యక్షుడు ఎంఆర్‌ కృష్ణ, ప్రధాన కార్యదర్శి రంగడు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు పాలూరీ రవిగువేరా, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

జిల్లా వినియోగదారుల కమిషన్‌లో:
జిల్లా వినియోగదారుల కమిషన్‌ కార్యాలయంలో కమిషన్‌ చైర్మన్‌ కె.కిషోర్‌ కుమార్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కమిషన్‌ సభ్యులు ఎన్‌.నారాయణ రెడ్డి, నజీమా కౌసర్‌, సిరస్తధార్‌ నక్కా రాముడు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో..

కర్నూలు(ఎడ్యుకేషన్‌): నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలో ఆజాదీ కా అమృత్‌ మహో త్సవాన్ని పురస్కరించుకుని 76 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక టౌన్‌మోడల్‌ జూనియర్‌ కళాశాలలో డీవీఈవో జమీర్‌పాష, ఆర్‌ఐవో గురువయ్య శెట్టి, ప్రభుత్వ కేవీఆర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ లాలెప్ప జాతీయజెండాను ఎగువేర వేశారు. బీ.క్యాంపులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ సుంకన్న, ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో ప్రిన్సిపాల్‌ నాగస్వామి నాయక్‌, అబ్బాస్‌ నగర్‌లోని రవీంద్ర విద్యానికేతన్‌లో విద్యాసంస్థల వ్యవస్థాపకుడు  జీ.పుల్లయ్య, రవీంద్ర బాలికల పాఠశాలలో డా.మమతామోహన్‌, లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్‌ పాఠశాలలో సీఈఓ జి.గోపినాథ్‌ జాతీయ జెండాను ఎగువేశారు. అలాగే డా.కేవీ.సుబ్బారెడ్డి ఇన్‌స్టి ట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీలో కరస్పాండెంట్‌ విజయలక్ష్మి, మైఫర్‌ కళాశాలలో డైరెక్టర్‌ .డా.ఆదిమూలపు సతీష్‌, మాధవినగర్‌ రెవెన్యూ కాలనీలోని రవీంద్ర ఇంగ్లీషు మీడియం స్కూలు, రవీంద్ర టాలెంట్‌ స్కూల్లో కరస్పాండెంట్‌ పీబీవీ సుబయ్య, మాంటిస్సోరి విద్యాసంస్థల్లో వేద గంగోత్రి ఫౌండర్‌ చైర్మన్‌ జీవీఎన్‌ఆర్‌.సత్యశేషసాయిప్రసాద్‌, విద్యాసంస్థల డైరెక్టర్‌ రాజశేఖర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.

కర్నూలు(అగ్రికల్చర్‌):
స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని కర్నూలు మార్కెట్‌  కమిటీ యార్డులో చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి  జాతీయ జెండాను ఎగురవేశారు. సెక్రటరీలు గోవిందు, రెహిమాన్‌, వెంకటేష్‌, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, నాగేష్‌ పాల్గొన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద చైర్‌పర్సన్‌ మహాలక్ష్మి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీఈవో రామాంజినేయులు, డీజీఎంలు ఉమామ హేశ్వరరెడ్డి, సునీల్‌ కుమార్‌, నాగిరెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో జేడీ వరలక్ష్మి, ఏడీఏ శాలురెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కర్నూలు మండల వ్యవసాయాధికారి విశ్వనాథ్‌, టెక్నికల్‌ అధికారి దస్తగిరి రెడ్డి, ఏవో శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఏపీఎంఐపీ కార్యాలయం వద్ద ప్రాజెక్టు అధికారి ఉమాదేవి, కల్లూరు వ్యవసాయ సహకార సంఘం వద్ద అధ్యక్షుడు శివశంకర్‌ రెడ్డి, సీఈవో పుల్లయ్య జాతీయ జెండాను ఎగురవేశారు.

టీడీపీ ఆధ్వర్యంలో మోటారు బైక్‌ ర్యాలీ : స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని టీడీపీ కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నగరంలో సోమవారం మోటారుబైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జెండాకు వందనం చేసి ఎన్టీ రామారావు విగ్రహానికి సోమిశెట్టి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా సోమిశెట్టి మాట్లాడుతూ భారతదేశానికి విదేశీ పాలన నుంచి విముక్తి కలిగి నేటికి 75 సంవత్సరాల్లోకి అడుగు పె డుతున్న సందర్బంగా వారు భారత పౌరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.  తెలుగు మహిళ కమిటీ నాయకులు చంద్రకళాబాయి, సంజీ వలక్ష్మి, టీవీ రాజ్యలక్ష్మితో పాటు రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర కుమార్‌, తెలుగు యువత ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్‌, గోపినాథ్‌, అబ్బాస్‌, రాజు, నరసిం హులు, హనుమంతరావు చౌదరి, సత్రం రామకృష్ణుడు, జేమ్స్‌, గట్టు తిలక్‌ పాల్గొన్నారు.

గూడూరు:
గూడూరు నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో చైర్మన్‌ జులపాల వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్లు పీఎన్‌ అస్లాం, గోనెగండ్ల బోయ లక్ష్మన్న, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ నరసింహులు, కౌన్సిలర్లు, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్‌ శివ రాముడు, మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ సునీత, పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ వెంకట నారాయణ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసారు. గూడూరులోని అయోధ్య నగర్‌లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరి ంచుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో అయోధ్య నగర్‌లో 300 అడుగుల జెండాతో నగర ప్రధాన రహదారుల గుండా ర్యాలీ చేపట్టారు. కార్యక్రమం ఏబీవీపీ స్టేట్‌ సెక్రటరీ మహేష్‌, బీజేపీ మండల అధ్యక్షుడు మల్లేష్‌నాయుడు, డమాం సురేష్‌, రాజేష్‌ పాలేగార్‌, శంకర్‌, శివరాముడు, రాము, హరి పాల్గొన్నారు.

కోడుమూరు: పట్టణంలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శేషఫణి, మండల పరిషత్‌ ఆఫీసులో రూతమ్మ, పోలీసు స్టేషన్‌లో సీఐ శ్రీధర్‌, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈవో అనంతయ్య, టీడీపీ కార్యాలయంలో నియోజ కవర్గ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌, పంచాయతీ కార్యాలయంలో సర్పంచు భాగ్యరత్న, సొసైటీ సింగిల్‌విండో అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, జడ్పీటీసీ రఘునా థ్‌రెడ్డి పాల్గొన్నారు.   


Updated Date - 2022-08-16T06:46:24+05:30 IST