మువ్వన్నెల జెండా రెపరెపలు

ABN , First Publish Date - 2022-08-16T05:39:53+05:30 IST

స్వాతం త్య్రదినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా మదనపల్లె పట్టణం లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి.

మువ్వన్నెల జెండా రెపరెపలు
మదనపల్లెలో జెండా ఎగురవేసి వందనం చేస్తున్న ఆర్డీవో మురళి

మదనపల్లె టౌన్‌/క్రైం/రూరల్‌/అర్బన్‌,ఆగస్టు 15: స్వాతం త్య్రదినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా మదనపల్లె పట్టణం లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. సోమవారం స్థానిక సబ్‌కలెక్టరే ట్‌లో ఆర్డీవో మురళి జాతీయపతాకాన్ని ఎగురేవేసి గౌరవ వందనం చేశారు.  మదనపల్లె కోర్టులో ఏడీజే భాస్కర్‌రావు, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రవిమనోహరాచారిలు పతాకావిష్కరణ చేశారు. అలాగే జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఆంజనే యులు, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఈదురుబాషా, టూ టౌన్‌లో సీఐ మురళీకృష్ణ, తాలూకాలో సీఐ సత్యనారాయణ, మదనపల్లె రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ శివాంజనే యులు, అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక అధికారి మా బుసుభాన్‌, సబ్‌జైలులో జైలు సూపరింటెండెంట్‌ రామకృష్ణ యాదవ్‌, డీవైఈవో కార్యాలయంలో డీవైఈవో కృష్ణప్ప, మున్సిపల్‌ కార్యాలయం ఎదుట చైర్‌పర్సన్‌ మనూజ జాతీ య జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌  వైస్‌చైర్మన్‌ జింకా వెంకటాచలపతి, కమిషనర్‌ ప్రమీల, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవో ప్రభాకర్‌రెడ్డి,  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో హెచ్‌ఎంలు మూడురంగుల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు. వాసవీక్లబ్‌ మదనపల్లె పట్టణఅధ్యక్షుడు రాజేష్‌, సభ్యులు విద్యార్థులకు ష్యూలు అందజేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్‌ సీకే శ్రీనివాసులు  జెం డాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఆర్టీసీ వన్‌డిపో లో గ్యారేజ్‌ వద్ద వన్‌డిపో మేనేజరు వెంకటరమణారెడ్డి జెండాను ఎగురవేసి సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశా రు. అనంతరం ఎక్కువ ఇందనం పొదుపు చేసి కేఎంపీఎల్‌ సాధించినవారికి ప్రశంసాపత్రాలను అందించారు.     మద నపల్లె ఎంపీడీవో, ఎంఈవో కార్యాలయాల్లో ఎంపీపీ రెడ్డెమ్మ జాతీయజెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ డి.ఉదయ్‌ కుమార్‌, వైస్‌ ఎంపీపీ నందినితాజ్‌, ఎంపీటీసీ లు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామసచివాలయాల్లో స్థానిక సర్పంచులు జెండాలను ఆవిష్కరించారు. మండలంలోని కోళ్లబైలు పంచాయతీ మేకలవారిపల్లెలోని పాఠశాలలో వాల్మీకి రిజర్వేషన్‌ సాధన సమితి వ్వవస్థాపక అధ్యక్షుడు పొదల నరసింహులు, ఆసంఘం నాయకులు  విద్యార్థులకు స్వీట్స్‌, అల్ఫాహారం అందజేశారు. వక్ఫ్‌బోర్డుకు చెందిన టిప్పుసుల్తాన్‌ కాంప్లెక్స్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా జెండా ఆవిష్కరించారు. 

బి.కొత్తకోటలో : బి.కొత్తకోట మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలపైన జాతీయ జెండాలు రెపరెపలాడాయి. నగర పంచాయతీ అయిన బి.కొత్తకోటలో వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్ర మాలలో ఎంపీపీ లక్ష్మినరసమ్మ, జడ్పీటీసీ రామచంద్రయా దవ్‌, సింగల్‌విండో ప్రెసిడెంట్‌ తిరుమల అమరనాథ్‌, ఆర్బీకే చైర్మన్‌ అనితా సంజీవరెడ్డి, ఎంపీడీవో శంకరయ్య, తహసీ ల్దార్‌ దనంజయులు, ఎస్‌ఐ రామ్మోహన్‌, ఎంఈవో రెడ్డిశేఖ ర్‌ తదితరులు పాల్గొని వారి వారి కార్యాలయాల్లో జాతీయపతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. కాగా బి.కొత్తకోట చాంబర్‌ అఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వ్యాపారులందరు భారీ ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు జితేంద్ర రావు, కార్యదర్శులు వెంకట్‌ రెడ్డి, ఒలేటి ప్రసాద్‌, కోశాధికారి సాంబశివయ్య, లతో పాటు పట్టణంలోని అన్ని షాపుల యజమానులు పాల్గొన్నారు. బి.కొత్తకోటకు చెందిన మహా విష్ణుసేన ఆధ్వర్యంలో  5వందల అడుగుల పొడవైన జాతీ య జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. 

కురబలకోటలో: కురబలకోట మండలంలో 75వ స్వాతం త్య్రదినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకు న్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దస్తగిరి, ఎంపీడీవో దిలీప్‌కుమార్‌, తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ భీమేశ్వరరావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ శ్రీధర్‌, ముదివేడు పోలీస్టేషన్‌లో ఎస్‌ఐ సుకుమార్‌, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగ ళ్లు సమీపంలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కశాశాలలో ఎన్‌.విజ యభాస్కర్‌ చౌదరి జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ  కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సి.యువరాజ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఉమాపతిరెడ్డి, వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో: పెద్దమండ్యంలో సోమవారం  స్వాతం త్య్ర దినోత్సవ  ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ  వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దమండ్యం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ నిర్మళాదేవి, ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీపీ పూర్ణచంద్రిక రమేష్‌,  పోలీసుస్టేషన్‌ ఎదు ట  ఎస్‌ఐ వెంకటేష్‌లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మార్సీలో ఎంఈవో మనోహర్‌, పీహెచ్‌సీ లో డాక్టర్‌ శ్రీలక్ష్మీ, కలిచెర్ల తెలుగు, ఉర్దూ హైస్కూల్‌ల్లో సింగిల్‌విండో చైర్మన్‌ కడప సుధహరరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. సర్పంచు లు, అధికారులు పాల్గొన్నారు.మండలంలోని ముసలికుంట బస్టాప్‌ ఎదుట మండల టీడీపీ కన్వీనర్‌ వెంకటరమణ జాతీయ జండాను ఆవిష్కరించారు. నార శ్రీనివాసులు, బిక్కా మధుకర, ఓబులేసు, పెద్దన్న పాల్గొన్నారు.   

పెద్దతిప్పసముద్రంలో: మండలంలో స్వాతంత్య్ర దినోత్స వ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడివో గిరిదర్‌రెడ్డి, ఎంపీపీ మహమూ ద్‌ జతీయ జెండాను ఎగుర వేశారు. తహసీల్దార్‌ కార్యాల యంలో ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ విద్యాసాగర్‌, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ మధురామచంద్రుడు, ఎమ్మార్సీలో ఎంఈవో నారాయణ, ఆయా  పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండాలను ఎగుర వేశారు. మండల కేంద్రమైన పీటీఎంలో ఆధ్యాత్మికవేత్త సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో వం ద అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. 

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె మండలంలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టులో ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తి సీజీ ఆసీపా సుల్తానా జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అనసూయమ్మ, తహసీల్దారు కార్యాలయంలో డీటీ హరి, ఎంఆర్‌సీలో ఎంఈవో త్యాగరాజు, వెలుగు కార్యాలయంలో ఏపీఎం మురళి, ఐటీఐలో ట్రైనింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసుల రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ సూచనల మేరకు సోమవారం మండల కేంద్రంలోని హరిత కూడలి వద్ద  టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి  జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉత్తమ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రామచంద్ర, బేరి శీన, చలపతి నాయుడు, తెలుగు యువత నాయకులు నరసింహులు, మధుసూధన్‌, మ్యూజికల్‌ శివ, రామ్మోహన రెడ్డి, వీరాంజనేయులు, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

పీలేరులో: పీలేరు మండల ప్రజలు స్వాతంత్య్ర ‘అమృత’ దినోత్సవాన్ని సోమవారం అట్టహాసంగా జరుపుకున్నారు. పీలేరులోని కోర్టు ప్రాంగణంలో ఏజేసీజే సాకే జ్యోతి, అర్బన్‌ సీఐ కార్యాలయంలో సీఐ మోహన్‌రెడ్డి, ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీపీ కంభం సతీశ్‌రెడ్డి, తహసీల్దారు కార్యాల యంలో తహసీల్దారు రవి, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ డాక్టర్‌ హబీబ్‌ బాషా జాతీయ జెండాను ఆవిష్క రించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవ లు అందించిన తమ సిబ్బందికి ఆర్టీసీ డీఎం బండ్ల కుమార్‌ ప్రశంసా పత్రాలు అందజేశారు. తలపుల పీహెచ్‌సీ వైద్యాధి కారి చంద్రశేఖర్‌ నాయక్‌ స్థానిక లక్ష్మీవృద్ధాశ్రమంలో స్వాతం త్య్ర దినోత్సవాన్ని జరిపి మిఠాయిలు పంచిపెట్టారు.  కార్యక్రమాల్లో పీలేరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రఫీ అన్సారీ, న్యాయవాదులు భవానీ శంకర, చంద్రకుమార్‌రెడ్డి, షౌకత్‌అలీ, వెంకటరమణారెడ్డి, ఎంపీడీవో మురళీమోహన్‌ రెడ్డి, ఈవో రెడ్డిప్రసాద్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి, వెంకటరెడ్డి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-16T05:39:53+05:30 IST