వాడవాడలో మువ్వన్నెల జెండా

ABN , First Publish Date - 2022-08-16T06:00:22+05:30 IST

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులతో పాటు ప్రజాప్రతినిధులు, పలువురు జిల్లా అఽధికారులు, పోలీసులు పాల్గొ న్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సందేశం అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి, కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, ఎస్పీ హర్షవర్థన్‌రాజులకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

వాడవాడలో మువ్వన్నెల జెండా
కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఎగురవేస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

రాయచోటి(కలెక్టరేట్‌/టౌన్‌), ఆగస్టు 15: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులతో పాటు ప్రజాప్రతినిధులు, పలువురు జిల్లా అఽధికారులు, పోలీసులు పాల్గొ న్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సందేశం అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి, కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, ఎస్పీ హర్షవర్థన్‌రాజులకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పలు ప్రభుత్వ శకటాలను ప్రదర్శించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 


ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో...

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదికా అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాయచోటి పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు, యాజమాన్య పాఠశాలల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో సత్యనారాయణ, కలెక్టరేట్‌ ఏవో బాలకృష్ణ, డీపీఆర్‌వో పురుషోత్తం, ఏపీఆర్‌వో ప్రభాకర్‌, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల సూపరిండెంట్లు, కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. అలాగే టీడీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రమే్‌షకుమార్‌రెడ్డి, గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయం వద్ద టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, నియోజకవర్గ టీడీపీ నాయకుడు సుగవాసి ప్రసాద్‌బాబు జాతీయ జెండాను ఎగురవేసి మహనీయుల త్యాగాల గురించి స్మరించుకున్నారు. అలాగే సీపీఐ కార్యాలయంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నరసింహులు, మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా జెండా ఎగురవేశారు. కాగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన రాయచోటి అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, రూరల్‌ సీఐ లింగప్పలు ఇన్‌చార్జి మంత్రి గోవర్థన్‌రెడ్డి, కలెక్టర్‌ గిరీషా, ఎస్పీ హర్షవర్థన్‌రాజు, జేసీ తమీమ్‌ అన్సారియా, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 

రాజంపేటలో...

పట్టణంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్డీవో కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థుల గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు యోగీశ్వర్‌రెడ్డి, మాజీ జిల్లా రెవెన్యూ అధికారి ఈశ్వరయ్య, ఈడిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చిదానందగౌడ్‌, పట్టణంలోని అన్ని శాఖల అధికారులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అదే విధంగా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ రామచంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్‌ చైర్మన్‌ చొప్పా యల్లారెడ్డి, ప్రిన్సిపల్‌ ఎస్‌ఎంవీ నారాయణ తదితరులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఔన్నత్యాన్ని వివరించారు. రాజంపేట కోర్టు ఆవరణలో జిల్లా మూడవ అదనపు జడ్జి ఆర్‌.వి.ఎ్‌సఎ్‌స.మురళీకృష్ణజాతీయ జెండాను ఆవిష్కరించగా, సీనియర్‌ సివిల్‌ జడ్జి సరస్వతి, జూనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి పాల్గొన్నారు. అలాగే రాజంపేట పాతబస్టాండు కూడలిలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పోతుగుంట రమే్‌షనాయుడు ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి స్థానికులకు మిఠాయిలు పంచిపెట్టారు. 

పలు మండలాల్లో వేడుకలు 

రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాయచోటి కోర్టు ప్రాంగ ణంలో ఐదవ అదనపు జిల్లా జడ్జి ఇతియాజ్‌బాషా ఆధ్వ ర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే జిల్లా న్యాయవాదుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద న్యాయవాదులు వేడుకలు జరుపుకున్నారు. అలాగే రాజంపేట మండలం రాజంపేట-పాలెం రోడ్డులోని డంపింగ్‌ యార్డు వద్ద మేముసైతం సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. రైల్వేకోడూ రులో ఎమ్మెల్యే, విప్‌ శ్రీనివాసులు టోల్గేట్‌ వద్ద సభ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇక చిన్నమండెం, గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, సంబేపల్లె, రైల్వేకోడూరు పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నుంచి టోల్గేట్‌ వరకు ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసుల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులతో త్రివర్ణ పతాకాలు చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే సుండుపల్లె, వీరబల్లి, చిట్వేలి, నంద లూరు, సిద్దవటం, పెనగలూరు, పుల్లంపేట, ఒంటిమిట్ట మండలాల్లో ర్యాలీలు, మానవహారాలు చేశారు. 







Updated Date - 2022-08-16T06:00:22+05:30 IST