ఎం.వి రమణారెడ్డి సాహిత్య సదస్సు

ABN , First Publish Date - 2021-01-09T06:20:13+05:30 IST

డాక్టర్. ఎం.వి రమణారెడ్డి వృత్తిరీత్యా వైద్యులు. సీమ ప్రాంతంలో అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి పోరాటాలు చేశారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి, నీళ్ళు, పరిశ్రమల కోసం రాయలసీమ విమోచన సమితి స్థాపించి ఉద్యమాలు చేసారు...

ఎం.వి రమణారెడ్డి సాహిత్య సదస్సు

డాక్టర్. ఎం.వి రమణారెడ్డి వృత్తిరీత్యా వైద్యులు. సీమ ప్రాంతంలో అనేక  కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి పోరాటాలు చేశారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి, నీళ్ళు, పరిశ్రమల కోసం రాయలసీమ విమోచన సమితి స్థాపించి ఉద్యమాలు చేసారు. "ప్రభంజనం" వంటి పత్రికలు నడిపారు. ఇక, సామాజిక, సాహిత్య అంశాల వ్యాసకర్తగా, కరపత్ర రచయితగా, కథారచయితగా, అనువాదకునిగా, విమర్శకునిగా, చరిత్రకారునిగా ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 8 పుస్తకాలు, 5 అనువాద పుస్తకాలు, సాహిత్య విలువలున్న ఇతరుల పుస్తకాలను కూడా ప్రచురించారు.


ఏడుపదుల వయసులోను సాహిత్య రంగంలో తనవంతు కృషి చేస్తూ వస్తున్నారు.  డాక్టర్ ఎం.వి రమణారెడ్డి సాహిత్య కృషిని నేటి తరాలకు  తెలియచేయాలని ‘వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం’, ‘చికాగో సాహితీ మిత్రులు’ సంకల్పించాయి. జనవరి 10 ఆదివారం ఉ. 9.-30 గం జూమ్‌ ద్వారా జరిగే ఈ సదస్సులో కె. రామచంద్ర మూర్తి, భూమన కరుణాకరరెడ్డి, నాగసూరి వేణుగోపాల్, బాణాల భుజంగరెడ్డి, ఆర్.యం. ఉమామహేశ్వరరావు, దేశం శ్రీనివాసరెడ్డి, వై.కామేశ్వరి, అంబటి సురేంద్ర రాజు, యస్‌. విజయక్రిష్ణ, జూపల్లె ప్రేమ్ చంద్, మువ్వా శ్రీనివాసరెడ్డి, పసునూరి రవీందర్, బి.హరిత, ఎ.వి.వి.కె చైతన్య, జి. మల్లికార్జున తదితరులు పాల్గొంటారు. తిమ్మాపురం ప్రకాశ్ సమన్వయం చేస్తారు. 


డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి 

9963917187

Updated Date - 2021-01-09T06:20:13+05:30 IST