నా తండ్రి ఖాతాలో డబ్బులు కాజేశారు

ABN , First Publish Date - 2022-06-28T06:32:10+05:30 IST

తన తండ్రి ఖాతాలోని డబ్బు ను తమ సమీప బంధువే, ఆయన సంతకం ఫోర్జరీ చేసి డ్రాచేసినట్టు జ్యోతి అనే మహిళ అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

నా తండ్రి ఖాతాలో డబ్బులు కాజేశారు
అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌కు ఫిర్యాదు చేస్తున్న బాధితులు


పోలీసు స్పందనలో ఓ మహిళ ఫిర్యాదు

కొత్తచెరువు, జూన 27: తన తండ్రి ఖాతాలోని డబ్బు ను తమ సమీప బంధువే, ఆయన సంతకం ఫోర్జరీ చేసి డ్రాచేసినట్టు జ్యోతి అనే మహిళ అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్పీ కార్యాల యంలో పోలీసు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అడిషనల్‌ ఎస్పీ రామక్రిష్ణప్రసాద్‌ బాధి తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జ్యోతి అనే మహిళ ఫిర్యాదు చేస్తూ... తన తండ్రి చెన్నేకొత్తపల్లికి చెందిన ఆదినారాయణ రైల్వేలో పనిచేస్తూ 2020లో ఉద్యోగ విరమణ చేశారని తెలిపారు. ఆ సందర్భంగా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బు ఆయన బ్యాంకు ఖాతాలోనే ఉందన్నారు. అయితే తన తండ్రి మరణించిన తరువాత తమ చిన్నాన్న  భార్య ఆయన సంతకం ఫోర్జరీ చేసి రూ.6లక్షలు డ్రా చేశారని తెలిపారు. ఈ విషయంపై చెన్నే కొత్తపల్లి పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆమె అడిషనల్‌ ఎస్పీ వద్ద  మొరపెట్టుకున్నారు. అదేవిధంగా దావిద్‌ అనే తాపీ మేస్ర్తీ మాట్లాడుతూ... తాను లేపాక్షిలో నవోదయ బిల్డింగ్‌ నిర్మాణం చేశానని తెలిపారు. అందుకు సంబంధించి తనకు రావాల్సిన రూ.5.30 లక్షలు ఇవ్వకుండా శింగనమల మండలానికి చెందిన రంగారెడ్డి అనే కాంట్రాక్టర్‌ బెదిరిస్తున్నారని  ఫిర్యాదు చేశాడు. దీనిపై ఇప్పటికే అనంతపురం ఎస్పీ కార్యాలయంలో రెండు సార్లు ఫిర్యాదు చేయగా... అక్కడి పోలీసులు ఫిర్యాదు చేయమని చెప్పారని అతడు విన్నవించారు. తన భార్య నగలు తాకట్టు పెట్టి అప్పుల వాళ్లకు కట్టానని, తనకున్యాయం చేయాలని మొరపెట్టుకున్నాడు. ఇలా స్పందన కార్యక్ర మంలో భర్తల వేధింపులు, సైబర్‌ నేరాగాళ్లు, భూసమస్యలు తదితరవాటిపై మొత్తం 48 ఫిర్యాదులు స్పందనలో వచ్చినట్టు అడిషనల్‌ ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌బ్రాంచ ఉమామహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2022-06-28T06:32:10+05:30 IST