హార్డ్‌డిస్క్‌ పనిచేయడం లేదు...

ABN , First Publish Date - 2020-08-08T06:02:58+05:30 IST

నేను ట్రాన్సెండ్‌ కంపెనీకి చెందిన 1 టీబీ హార్డ్‌డిస్క్‌ను నాలుగు సంవత్సరాలుగా వాడుతున్నాను. ఈ మధ్య అది పనిచేయడం లేదు. కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేస్తే ‘‘యూఎస్‌బి డివైజ్‌ నాట్‌ రికగ్నైజ్డ్‌’’ అనే మెసేజ్‌ వస్తోంది...

హార్డ్‌డిస్క్‌ పనిచేయడం లేదు...

నేను ట్రాన్సెండ్‌ కంపెనీకి చెందిన 1 టీబీ హార్డ్‌డిస్క్‌ను నాలుగు సంవత్సరాలుగా వాడుతున్నాను. ఈ మధ్య అది పనిచేయడం లేదు. కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేస్తే ‘‘యూఎస్‌బి డివైజ్‌ నాట్‌ రికగ్నైజ్డ్‌’’ అనే మెసేజ్‌ వస్తోంది. ఇతర కంప్యూటర్లలో కూడా పనిచేయడం లేదు. దీనికి పరిష్కారం సూచించగలరు. 

- రమేష్‌


మీ హార్డ్‌డిస్క్‌ ఫెయిల్‌ అయినట్లు తెలుస్తోంది. ఇది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. హార్డ్‌డిస్క్‌ మీద ఉండే లాజిక్‌ బోర్డ్‌ (విద్యుత్‌ సరఫరా తదితర సర్క్యుటరీ కలిగి ఉండేది) దెబ్బతిని ఉండవచ్చు. ఒకవేళ సమస్య అదే అయితే దాన్ని మార్పించుకుంటే ఖచ్చితంగా మీ డేటా వెనక్కి వస్తుంది. హార్డ్‌డిస్క్‌ను సర్వీస్‌ సెంటర్‌లో ఇవ్వడం మంచిది. కొన్ని సందర్భాలలో హార్డ్‌డిస్క్‌ అంతర్గతంగా ఉండే ప్లాటర్లు దెబ్బతిని ఉంటాయి. అలాంటప్పుడు డబ్బులు చెల్లించి డేటా రికవరీ సర్వీసుల సహకారం తీసుకోవాల్సిందే. కొన్నిసార్లు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినా కూడా మీ డేటా వెనక్కి వస్తుందన్న గ్యారంటీ ఉండదు.


Updated Date - 2020-08-08T06:02:58+05:30 IST