అది చూసి నా గుండె బద్దలైంది: కంగనా రనౌత్

Published: Mon, 01 Mar 2021 21:15:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అది చూసి నా గుండె బద్దలైంది: కంగనా రనౌత్

ముంబై: కంగనా కార్యాలయంలోని ఓ భాగాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చేసినప్పటి దృశ్యాలను కంగనా తాజాగా ట్వీట్ చేసింది. ఈ ఘటనకు పూర్వం తీసిని ఫోటోను కూడా ‘అప్పుడు-ఇప్పుడు’ పేరుతో నెటిజన్లతో పంచుకుంది. ‘వీటిని చూస్తుంటే నా మనసు మళ్లీ ముక్కలవుతోంది’ అని ఆమె వ్యాఖ్యానించింది. సోమవారం నాడు ఆ కార్యాలయంలో జరిగిన ఓ మీటింగ్‌కు కంగనా రనౌత్ హాజరయ్యారు. తన కార్యాలయం ఈ స్థితిలో ఉండటాన్ని తాను చూడలేకపోతున్నానని ట్వీట్ చేశారు. ఇంతకాలం తరువాత ఇక్కడి దృశ్యాలను చూసి తన గుండె మరోసారి ముక్కలైందని వ్యాఖ్యానించారు. కంగనా కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆ కట్టడాలను గతేడాది కూల్చేసిన విషయం తెలిసిందే.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.