ప్రధాని మోదీ గారూ.. నా చివరి కోరిక తీర్చండి.. అంటూ లేఖ రాసి మరీ 16 ఏళ్ల కుర్రాడి దారుణమిది..!

ABN , First Publish Date - 2021-10-11T20:07:35+05:30 IST

అతనొక గొప్ప డ్యాన్సర్ కావాలని కలలు కన్నాడు. కానీ అది నెరవేరే మార్గం లేదని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ సూసైడ్ నోట్ రాశాడు. అందులో తన ఆత్మ శాంతించాలంటే ఏం చేయాలనేది కూడా చెప్పాడు. ఇంతకీ అతని కలేంటి? ఎందుకు నెరవేరలేదు? అనేది తెలియాలంటే పూర్తి వివరాల్లోకెళ్లాల్సిందే.

ప్రధాని మోదీ గారూ.. నా చివరి కోరిక తీర్చండి.. అంటూ లేఖ రాసి మరీ 16 ఏళ్ల కుర్రాడి దారుణమిది..!

భోపాల్: అతనొక గొప్ప డ్యాన్సర్ కావాలని కలలు కన్నాడు. కానీ అది నెరవేరే మార్గం లేదని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ సూసైడ్ నోట్ రాశాడు. అందులో తన ఆత్మ శాంతించాలంటే ఏం చేయాలనేది కూడా చెప్పాడు. ఇంతకీ అతని కలేంటి? ఎందుకు నెరవేరలేదు? అనేది తెలియాలంటే పూర్తి వివరాల్లోకెళ్లాల్సిందే..


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల అజ్జు ఇంటర్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి అతడికి డ్యాన్స్ అంటే ప్రాణం. దేశంలోనే తనొక గొప్ప డ్యాన్సర్ కావాలని కలలు కన్నాడు. కానీ అజ్జు తల్లితండ్రులకు అతడు డ్యాన్సర్ అవడం ఇష్టం లేదు. అందువల్ల ఎప్పుడూ చదువు మీద మాత్రమే శ్రద్ధ పెట్టమని హెచ్చరించేవారు. తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో అతడి కుటుంబసభ్యులు సహకరించట్లేదని మనస్తాపం చెందిన అజ్జు ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న జాన్సీ రోడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధితుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అక్కడ పోలీసులకు అజ్జు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. 


పోలీసులు తెలిపిన ప్రకారం సూసైడ్ నోట్‌లో ఏం ఉందంటే.. ‘‘అమ్మా, నాన్నా.. నన్ను క్షమించడంది. నేను మీకు మంచి కొడుకును కాలేకపోయాను. మిమ్మల్ని విడిచి వెళ్తున్నందుకు బాధగా ఉంది. నేనొక గొప్ప డ్యాన్సర్‌ని కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. కానీ దానికి మీరు సపోర్ట్ చేయలేదు. బాగా డబ్బున్నవాళ్లే డ్యాన్సర్ అవుతారని భావించారు. నేను చేసే పనులేవి మీకు నచ్చేవి కావు. అది మీ తప్పు కాదు.. నా తప్పు. కానీ నేను ఇంకెలాంటి తప్పులు చేయలేదు’’ అని లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు.


చివరగా ఇంకో విషయం రాశాడు. అందులో ‘‘ప్రభుత్వానికి నాదొక విన్నపం. నా చావు తర్వాత నాపై ఒక పాటను రాయించాలి. దేశంలోనే అతి పెద్ద సింగర్ అయిన అర్జిత్ సింగ్‌తో ఆ పాటను పాడించాలి. నేపాల్‌కు చెందిన ప్రముఖ డ్యాన్సర్ సుశాంత్ కత్రి ఆ పాటకు డ్యాన్స్ చేయాలి. ఆయనే దానికి కొరియోగ్రాఫర్‌గా కూడా చేయాలి. నేను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతాను. నా చివరి కోరిక నెరవేర్చితేనే నా ఆత్మ శాంతిస్తుంది. నా ఈ చిన్న కోరికను తీర్చమని ప్రధానిని కూడా కోరుకుంటున్నాను’’ అని తెలిపాడు.


ఝాన్సీ రోడ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సంజీవ్ నయన్ శర్మ మాట్లాడుతూ.. రైలు కిందపడి  ఆత్మ హత్య చేసుకోవడంతో కుర్రాడి శరీరం రెండు భాగాలుగా విడిపోయిందన్నారు. ఘటనా స్థలంలో తమకు సూసైడ్ నోట్ లభ్యమైందని, దాన్ని స్వాధీనం చేసుకున్నామని  అన్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామన్నారు. బాధితుడు డ్సాన్సర్ కానేమోనని ఒత్తిడికి గురై, ఆత్మహత్య చేసుకున్నట్లు తాము భావిస్తున్నామన్నారు. 

Updated Date - 2021-10-11T20:07:35+05:30 IST