మా గారాలపట్టిని అలా చూడలేకపోతున్నాను...

ABN , First Publish Date - 2021-08-25T17:15:08+05:30 IST

బోసినవ్వుల నా పండంటి పసిపాపకు 13 జూన్ 2021వ తేదీన జన్మనిచ్చాను. కానీ ఏం చెప్పను... ఆమె జననం మేం అనుకున్నట్టు జరగలేదు.

మా గారాలపట్టిని అలా చూడలేకపోతున్నాను...

బోసినవ్వుల నా పండంటి పసిపాపకు 13 జూన్ 2021వ తేదీన జన్మనిచ్చాను. కానీ ఏం చెప్పను... ఆమె జననం మేం అనుకున్నట్టు జరగలేదు. నా రెండవ ప్రసవం మేం ఆశించినట్టుగా సాఫీగా జరగలేదు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు చివరి కొద్ది నెలల్లో నా బీపీ, షుగర్ లెవెల్స్ తరచుగా హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఈ హెచ్చుతగ్గుల వల్ల డాక్టర్లు నాకు C- section చెయ్యాలని నిర్ణయించారు. ఫలితంగా నేను నెలలు నిండక ముందే పసిపాపకు జన్మనిచ్చాను. మరోవైపు నా దేహం బలహీనం కావడంతో తల్లీ, బిడ్డలైన మా ఇద్దరి క్షేమం కోసం ప్రసవించాల్సి వచ్చింది.


కానీ, పాపాయి పుట్టిన 2 రోజులకు మా ప్రపంచమంతా తల్లకిందులైంది. మా పాప నెలలు నిండక ముందే పుట్టడం వల్ల, తన శరీరం పెళుసుగా, దుర్బలమై ఉంది. దాంతో తనను బతికించుకోవడానికి మరింత మెరుగైన వైద్య సహాయం అవసరమైంది. అయితే, అమ్మాయి శరీరానికి తగినంత రక్తం, ప్రాణవాయువు అందడం లేదని డాక్టర్లు చెప్పారు. ఈ పరిస్థితిని perinatal asphyxia అంటారు. మా పసిగుడ్డుకు శ్వాస అందడానికి యంత్రాల సాయం అవసరం కావడంతో ఇంక్యుబేటర్‌లో ఉంచాం. శరీరం దుర్బలమై, నీలి రంగులోకి మారి, సూదులు గుచ్చి, ట్యూబుల మధ్య ఉన్న నా చిట్టి తల్లిని చూస్తుంటే నా గుండె చెదిరిపోయింది, నా ఒళ్లు కొయ్యబారిపోయింది.


సాయం అందించడానికి క్లిక్ చేయండి


నా భర్త నన్ను ఎంతగా ఓదార్చేందుకు ప్రయత్నించినా నా కూతుర్ని ఇలా చూడాల్సి రావడం నేను భరించలేకపోయాను. ఊపిరి తీసుకోవడానికే అల్లాడిపోతున్న నా చిన్నారిని చూస్తూ ఎలా తట్టుకోగలను? మొదటి సంతానంగా పుట్టిన నా కొడుక్కి ఒకటే కిడ్నీ ఉంది. వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నందువల్ల తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటాడు. రాత్రీ, పగలూ వాడి క్షేమం కోసం ఆందోళనపడుతూనే ఉంటాను.


అబ్బాయి ఆరోగ్యం కోసం ఒక పక్క వేదన చెందుతున్న ఈ పరిస్థితుల్లో.... ఇప్పుడు నా కూతురు కూడా తీవ్రంగా బాధపడుతుండటం చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అనుభవించడం నావల్ల కావడం లేదు. ప్రస్తుతం మా పాపాయిని కాపాడుకోవడానికి ఇంకా ఇంక్యుబేటర్‌లోనే ఉంచాము. పాప కోలుకోవాలంటే సుదీర్ఘ కాలం పాటు NICUలో ఉండి వైద్యం చేయించాల్సి ఉంటుంది. ఇందుకు సుమారుగా రూ.8 లక్షలు ($ 10772.10) ఖర్చవుతుందట. ఈ మొత్తం నాకు తలకు మించిన భారం. నేను భరించే పరిస్థితి లేదు. నా భర్త, నేను అత్యంత నిరుపేద కుటుంబాల నుంచి వచ్చాం. మా ఆయన కూలీ పని చేస్తూ చాలీచాలని ఆదాయం తెస్తున్నాడు. నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్ళడమే మాకు కనాకష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో అంత ఖర్చు పెట్టి మా చిట్టితల్లిని కాపాడుకోవడం ఎలాగో అర్థం కావడం లేదు. మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో మీ సాయాన్ని అర్థిస్తున్నాం. మీ సహాయం లేనిదే నా బిడ్డకు కొత్త జీవితం, మంచి భవిష్యత్తు సాధ్యం కావు. సమయం ఎక్కువ లేదు.... మీరే మాకు దిక్కు. దయచేసి పెద్ద మనసుతో మీ వల్ల సాధ్యమైనంత విరాళం ఇవ్వండి.


విరాళం ఇవ్వడానికి క్లిక్ చేయండి





Updated Date - 2021-08-25T17:15:08+05:30 IST