పుట్టిన ఇద్దరూ డేంజర్‌లో ఉన్నారు... మీరే కాపాడాలి ప్లీజ్

Published: Fri, 24 Sep 2021 14:17:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon

నేను కవలపిల్లలకు జన్మనిచ్చిన రోజున... అంతులేని ఆనందంలో మునిగిపోయాను. నా కల నిజమైన రోజది. నేనెప్పుడూ నాకొక కుటుంబం ఉండాలని కోరుకున్నాను. నా పిల్లలే నా ప్రపంచం.


కానీ, తొలిసారి తల్లినయ్యాక, నాకు ఆ మాతృత్వపు మధురిమలు నిలబడింది కొద్దిసేపు మాత్రమే. పిల్లలు పుట్టాక వాళ్లను ఒక్కసారైనా చూసుకునే అదృష్టం దక్కలేదు. నాకు పుట్టిన కవల పిల్లలు ఈ లోకంలోకి వచ్చిన వెంటనే NICU (Neonatal Intensive Care Unit)కి తరలించారు.

ఎందుకంటే, వాళ్లు నెలలు నిండక ముందే పుట్టడం వలన, వారి ఆరోగ్య పరిస్థితి చాలా బలహీనంగా ఉండటంతో సరిగ్గా ఊపిరి అందడం కోసం వెంటనే లైఫ్ సపోర్ట్ ఏర్పాటు చెయ్యాల్సి వచ్చింది. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే ఆ పసికందుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. పిల్లలిద్దరికీ పూర్తిగా అవయవాలు ఏర్పడనందువల్ల వారికి శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎదురయ్యాయని డాక్టర్లు మాకు చెప్పారు.


ఈ లింక్ మీద క్లిక్ చేసి, ఈ పసికందుల కోసం పెద్ద మనసుతో విరాళం ఇవ్వండి....

నా చిన్నారుల చిట్టి దేహాలు సూదుల మధ్య నరకయాతన పడుతుండటం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. కన్నీటి ధారల మధ్యే వాళ్లను చూడాల్సి వస్తోంది. అందరి తల్లుల్లాగా నాక్కూడా నా పిల్లలు పూర్తి రక్షణతో ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లల్లో ఒకరి పరిస్థితి మరీ ప్రమాదకరంగా ఉంది. ఇద్దరికీ అనేక సమస్యలున్నందు వల్ల ఆరోగ్యం మెరుగు కావడం కోసం రక్తమార్పిడి, ఇంకా surfactant treatment అవసరమైంది. పిల్లలిద్దరూ చక్కని ఆరోగ్యంతో బయటకు రావాలంటే వారికి మరి కొంత కాలం NICUలోనే చికిత్స జరగాల్సి ఉంది. ఇందుకు సుమారు రూ.10 లక్షలు  ($ 13481.50) అవసరమవుతాయి.


అయితే, దురదృష్టవశాత్తు మా దగ్గర అంత డబ్బు లేదు. నా భర్త నెలకు కేవలం రూ.8,000 మాత్రమే సంపాదించే ఒక షాప్ కీపర్. ఇప్పటి వరకూ మాదగ్గరున్న సొమ్మంతా ఈ పిల్లల వైద్యం కోసమే ఖర్చు పెట్టేశాం. మా పిల్లల్ని ప్రాణాలతో తెచ్చుకోవడానికి అవసరమైన అంత పెద్ద మొత్తాన్ని సంపాదించడం మా వల్ల కాదు. ఈ పిల్లలే మా జీవితం.... వాళ్లే మా లోకం. పుట్టిన కొద్ది రోజులకే ఈ పరిస్థితి రావడం నాకు భరించలేనంత వేదనగా ఉంది. మమ్మల్ని ఆదుకునేవారు కనిపించడం లేదు. అందుకే... నా పసివాళ్లను కాపాడుకోవడానికి దయతో మీకు సాధ్యమైనంత విరాళం ఇవ్వాల్సిందిగా అర్ధిస్తున్నాను.


మీరే మా ఆశ...


ఈ లింక్ మీద క్లిక్ చేసి, ఈ పసికందుల కోసం పెద్ద మనసుతో విరాళం ఇవ్వండి....


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయం Latest News in Teluguమరిన్ని...

చిత్రజ్యోతి Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.