మైలాన్ ఫార్మా రెమ్డిసివిర్ జనరిక్ వెర్షన్ ధర తెలిసింది..!

ABN , First Publish Date - 2020-07-07T05:53:07+05:30 IST

రోనాకు అత్యవసర మందుగా ప్రముఖ ఫార్మా సంస్థ మైలాన్ తీసుకొస్తున్న రెమ్డిసివిర్ జనరిక్ వెర్షన్ ధరను...

మైలాన్ ఫార్మా రెమ్డిసివిర్ జనరిక్ వెర్షన్ ధర తెలిసింది..!

కరోనాకు అత్యవసర మందుగా ప్రముఖ ఫార్మా సంస్థ మైలాన్ తీసుకొస్తున్న రెమ్డిసివిర్ జనరిక్ వెర్షన్ ధరను ఆ సంస్థ నిర్ణయించింది. 100 ఎంజీ వయల్(ఇంజక్షన్) ధర 4,800 రూపాయలుగా సంస్థ ప్రకటించింది. డెస్‌రెమ్ పేరుతో ఈ వయల్ అందుబాటులోకి రానుంది. ఈ నెలలోనే భారత్‌లో విక్రయాలు ప్రారంభించనున్నట్లు మైలాన్ ఫార్మా స్పష్టం చేసింది. డెస్‌రెమ్‌కు డీసీజీఐ నుంచి అనుమతి కూడా లభించిందని పేర్కొంది.


భారత్‌లో కోవిడ్-19 బాధితులకు చికిత్సలో భాగంగా.. ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌తో పాటు కొన్ని యాంటీ వైరల్ మందులు కూడా ఇస్తున్నారు. ఆ యాంటీ వైరల్ మందుల్లో రెమ్డిసివిర్ ఒకటి. ఇప్పటికే రెమ్డిసివిర్‌ జనరిక్ వెర్షన్‌ను సిప్లా ‘సిప్రెమి’ పేరుతో, హెటిరో ‘కోవిఫర్’ పేరుతో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ‘సిప్రెమి’ ధర రూ.5000 కాగా, ‘కోవిఫర్’ ధర రూ.5,400.

Updated Date - 2020-07-07T05:53:07+05:30 IST