మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ

ABN , First Publish Date - 2022-06-29T03:22:48+05:30 IST

మండల పరిధిలోని ఊటుకూరులో సాధన మైనింగ్‌పై మంగళవారం పర్యావ రణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సంద

మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ
మాట్లాడుతున్న డీఆర్వో నారాయణమ్మ

సైదాపురం, జూన్‌ 28: మండల పరిధిలోని ఊటుకూరులో సాధన మైనింగ్‌పై మంగళవారం పర్యావ రణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో నారాయణమ్మ మాట్లాడుతూ గిద్దలూరులోని  సర్వే నెంబర్‌ 114/3(పి)లో ఓపెన్‌ కాస్ట్‌ పద్ధతిలో 6.896  హెక్టార్ల విస్తీర్ణంలో  చేపట్టే  క్వార్జ్‌-6965 టన్స్‌ ఫర్‌ యానమ్‌ (టీపీఏ),  మైకా-3483 టీపీఏ, పెల్డ్‌స్పార్‌-41792 టీపీఏ చేసే  మైనింగ్‌ ప్రాజెక్ట్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. దీంతో మైనింగ్‌ అనుమతుల కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామన్నారు. కార్యక్రమంలో పొల్యూషన్‌ అధికారి రాజశేఖర్‌, తహసీల్దార్‌ కృష్ణ, మైనింగ్‌ యజమాని సురేష్‌రెడ్డి,  ఎన్జీవోలు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T03:22:48+05:30 IST