Mysoore: మైసూరు రాజకుటుంబంలో సంప్రదాయ సరస్వతీ పూజ

ABN , First Publish Date - 2022-10-03T17:14:32+05:30 IST

మైసూరు(Mysoor) ప్యాలెస్‌లో రాజ కుటుంబీకులు సంప్రదాయంగా సరస్వతీ పూజను జరిపారు. ప్యాలెస్‌లో ఆది వారం సరస్వతీ చిత్రపటాని

Mysoore: మైసూరు రాజకుటుంబంలో సంప్రదాయ సరస్వతీ పూజ

బెంగళూరు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మైసూరు(Mysoor) ప్యాలెస్‌లో రాజ కుటుంబీకులు సంప్రదాయంగా సరస్వతీ పూజను జరిపారు. ప్యాలెస్‌లో ఆది వారం సరస్వతీ చిత్రపటానికి వీణ, తాళపత్ర గ్రంథాలు, సంస్కృత గ్రంథాలు, గత రాజుల రచనలతోపాటు ప్రాచీన గ్రంథాలను ఉంచి పూజలు జరిపారు. శరన్నవరాత్రులలో భాగంగా ఉదయం 10గంటల నుంచి సరస్వతీపూజ కొనసాగింది. కాగా ప్యాలెస్‌ ముందు భాగాన ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌ వీరభద్ర కుణితకు అనుగుణంగా నృత్యాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. వీర భద్రకుణిత కళాబృందాలతో కలసి మంత్రి పాల్గొన్నారు. వరుస సెలవులు రావడంతో ఆదివారం ప్యాలెస్‌, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు వేలాదిమంది తరలివచ్చారు. కేఆర్‌ఎస్‌ ప్రాజెక్టును వీక్షించారు. 

Updated Date - 2022-10-03T17:14:32+05:30 IST