Yuva Dussehra: మైసూరులో నేటి నుంచి ‘యువ దసరా’

ABN , First Publish Date - 2022-09-28T15:20:34+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా ‘యువ సంభ్రమ’, యువ దసరా వేడుకలు బుధవారం లాంఛనంగా ప్రారంభం

Yuva Dussehra: మైసూరులో నేటి నుంచి ‘యువ దసరా’

                         - ప్రతి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు


బెంగళూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా ‘యువ సంభ్రమ’, యువ దసరా వేడుకలు బుధవారం లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు మహారాజ కళాశాల మైదానం వేదిక కానుంది. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10వరకు యువ దసరాలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు దసరా ఉత్సవాల కమిటీ(Dussehra Celebrations Committee) అధ్యక్షుడు, మైసూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌ వెల్లడించారు. మైసూరులో మంగళవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. 28న సాయంత్రం 7 గంటలకు పునీత్‌రాజ్‌కుమార్‌కు నివాళిగా ‘అప్పు నమన’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ సతీమణి అశ్విని, నటుడు శివరాజ్‌కుమార్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొంటారు. ఈ వేడుకలో నేపథ్యగాయకులు గురుకిరణ్‌, విజయ్‌ ప్రకాశ్‌, కునాల్‌ గాంజావాలా తదితరులు పునీత్‌ నటించిన హిట్‌ చిత్రాల పాటలు ఆలపించనున్నారు. 29న యువసంభ్రమ కార్యక్రమంలో నృత్య ప్ర దర్శన, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు నేపథ్యగాయని కన్నికా కపూర్‌ ‘రస సంజె’ ఏరపాటు కానుంది. 30న నృత్య ప్రదర్శనలు, రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే కళాకారులచే నృత్య రూపకాలు, శాండల్‌వుడ్‌ నె ౖట్‌ కార్యక్రమాలు ఉంటాయి. అక్టోబరు 1న నేపథ్య గాయకుడు సోనూనిగమ్‌, గాయని శమిత మల్నాడ్‌ సంగీత కార్యక్రమం ఉంటుంది. 2న విజయ రాఘవేంద్ర, ప్రముఖ గాయని మంగ్లి ప్రత్యేక సంగీత కార్యక్రమం, 3న సుప్రియరామ్‌ మహిళా బృందం ప్రదర్శన, ఫ్యాషన్‌ షో జరగనున్నాయి. పోస్టర్ల విడుదలలో మైసూరు ఎంపీ ప్రతా్‌పసింహ, మేయర్‌ శివకుమార్‌తోపాటు పలు కమిటీల అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-28T15:20:34+05:30 IST