Third place: దేశంలో మైసూరు జూకు మూడోస్థానం

ABN , First Publish Date - 2022-09-17T17:16:59+05:30 IST

దేశంలో అత్యుత్తమ జూలలో మైసూరుకు మూడో స్థానం దక్కింది. ఈ మేరకు జూ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజిత్‌ కులకర్ణి(Ajith Kulkarni) శుక్రవారం

Third place: దేశంలో మైసూరు జూకు మూడోస్థానం

బెంగళూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): దేశంలో అత్యుత్తమ జూలలో మైసూరుకు మూడో స్థానం దక్కింది. ఈ మేరకు జూ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజిత్‌ కులకర్ణి(Ajith Kulkarni) శుక్రవారం మీడియాకు తెలిపారు. కేంద్ర జంతుప్రదర్శన శాలల ప్రాధికార ప్రకటించిన జాబితాలో తొలిస్థానం డార్జిలింగ్‌కు, రెండోస్థానం చెన్నై జూకు దక్కిందన్నారు. మైసూరు జూ నిర్వహణ, సంస్కరణ విభాగంలో సాంకేతిక విధానాలు అమలు చేస్తున్నామన్నారు. మైసూరు జూ అత్యుత్తమ నిర్వహణకు గాను గుర్తింపు లభించిందన్నారు. జూలో 149 వివిధ రకాల వన్యజీవుల జాతులు ఉన్నాయన్నారు. వీటిలో 1450కు పైగా జంతువులు, పక్షులు ఉన్నాయన్నారు. 157 ఎకరాల విస్తీర్ణంలో ఉండే జూకు అనుబంధంగా చెరువు ఉందన్నారు. మైసూరులోని కూర్గళ్లిలో 50 ఎకరాల్లో వన్యజీవుల సంరక్షణ, పునరావాస కేంద్రం అనుబంధంగా ఉందన్నారు. 

Updated Date - 2022-09-17T17:16:59+05:30 IST