Queen Pramodevi: మైసూరు ప్యాలెస్‏లో ప్రైవేట్‌ దర్బార్‌కు సన్నాహాలు

ABN , First Publish Date - 2022-09-21T18:09:53+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలకు సంబంధించి రాచనగరి మైసూరులో కోలాహల వాతావరణం ప్రారంభమైంది. రెండేళ్ల తర్వాత

Queen Pramodevi: మైసూరు ప్యాలెస్‏లో ప్రైవేట్‌ దర్బార్‌కు సన్నాహాలు

                                - పర్యవేక్షించిన రాణి ప్రమోదాదేవి


బెంగళూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలకు సంబంధించి రాచనగరి మైసూరులో కోలాహల వాతావరణం ప్రారంభమైంది. రెండేళ్ల తర్వాత వైభవోపేత దసరా ఉత్సవాల(Dussehra celebrations)కు సర్వత్రా సన్నాహాలు జరుగుతున్నాయి. మైసూరు ప్యాలెస్ లో ప్రైవేట్‌ దర్బార్‌ కోసం సింహాసనాన్ని సిద్ధం చేసే ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఈ కారణంతో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్యాలెస్‌ గేట్లను పూర్తిగా మూసివేశారు. రాణి ప్రమోదాదేవి స్వయంగా సింహాసనాన్ని జోడించే కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్యాలెస్(Palace)లోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచిన బంగారు సింహాసన భాగాలను మహారాణి సమక్షంలో బయటకు తీసి పూజా కైంకర్యాలు చేపట్టారు. ప్యాలె్‌సలో గణపతి హోమం, చాముండేశ్వరి పూజ, శాంతి హోమం కార్యక్రమాల్లో రాజ కుటుంబీకులు పాలు పంచుకున్నారు. ఈనెల 26న ప్యాలెస్‌లో జరిగే ప్రైవేట్‌ దర్బార్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని యువరాజు యదువీర శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్‌ మంగళవారం మీడియాకు తెలిపారు. కాగా దసరా ఉత్సవాల్లో ప్రముఖమైన అంబారీ కోసం గజరాజుల ట్రయల్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కొయ్య అంబారీపై ఇసుక బస్తాలతో గజరాజు అభిమన్యు ఊరేగింపు కనుల పండువగా సాగింది. వీటిని తిలకించేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చారు. 

Updated Date - 2022-09-21T18:09:53+05:30 IST