కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడాలి

ABN , First Publish Date - 2021-04-18T05:04:04+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలు అ పోహలు పెట్టుకోవద్దని, అందరూ టీకాలను వేయించుకోవా లని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ అన్నారు.

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడాలి
కొదురుపాకలో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

- జిల్లా వైద్య, అరోగ్య శాఖ అధికారి ప్రమోద్‌

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 17: కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలు అ పోహలు పెట్టుకోవద్దని, అందరూ టీకాలను వేయించుకోవా లని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ అన్నారు. మండ లంలోని కొదురుపాక సబ్‌సెంటర్‌లో  శనివారం వ్యాక్సినేష న్‌ కేంద్రాన్ని ఎంపీపీ బాలాజీరావు ప్రారంభించారు. చుట్టు పక్క గ్రామాలకు చెందిన 132 మందికి వ్యాక్సిన్‌లు వేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారి ఈ కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ కోవాగ్జిన్‌, కోవీ షీల్డ్‌ వ్యాక్సిన్లలో ఎలాంటి తేడా ఉండదని, రెండు రకాల వ్యాక్సిన్‌లు ఒకేతీరుగా పనిచేస్తాయన్నారు. ఈ విషయంలో ప్రజలు అనుమానాలను వీడాలన్నారు. కరోనా వ్యాప్తి ఉదృ తంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసర మైతేనే తప్ప బయట తిరగవద్దని, విధిగా మాస్కులు ధరిం చాలని భౌతికదూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, కొదురుపాక, దేవునిపల్లి సర్పంచులు సాగర్‌రావు, కోమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T05:04:04+05:30 IST