జయశంకర్ వ్యవసాయ వర్శిటీని సందర్శించిన నాబార్డ్ ఛైర్మన్

ABN , First Publish Date - 2021-11-30T22:29:22+05:30 IST

నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు మంగళవారం రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు

జయశంకర్ వ్యవసాయ వర్శిటీని సందర్శించిన నాబార్డ్ ఛైర్మన్

హైదరాబాద్: నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు మంగళవారం రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ముందుగా ఆయన అగ్రిహబ్ ఇన్నోవేషన్ సెంటర్ లో స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో, వైస్ ఛాన్సలర్ డా. ప్రవీణ్ రావుతో కలిసి సమావేశమయ్యారు. తర్వాత విశ్వ విద్యాలయ పరిధిలోని మిల్లెట్ ఇంకుబేషన్ సెంటర్, ఏఆర్ఐ క్యాంపస్ లోని వరి పరిశోధనా కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు. వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు వరి సెంటర్ లో జరుగుతున్న పరిశోధనలను నాబార్డ్ ఛైర్మన్ కు వివరించారు. 


వరి సాగులో వివిధ దశలలో డ్రోన్ టెక్నాలజీ సహాయంతో పురుగుల మందు పిచికారీ, వరి రకాల సాగు విస్తీర్ణం అంచనా వేయడం, తెలంగాణ సోనా సాగుకు సంబంధించిన వివరాలను శాస్ర్తవేత్తలు వివరించారు. డ్రోన్ ద్వరా వరి వెదజల్లే పద్దతి లైవ్ డెమోన్ స్ర్టేషన్ ను ఆయన తిలకించారు. వరి పంటకు సంబంధించి విశ్వ విద్యాలయం డెవలప్ చేసిన రకాలను, డెవలప్ చేయబోతున్న రకాలను గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. 


వరిలో డ్రోన్ వినియోగంతో సమయం, ఖర్చు ఎంతవరకు ఆదా అవుతుందని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవల గురించి వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు ఆయనకు వివరించారు. ఈ పర్యటనలో తెలంగాణ ప్రాంత నాబార్డ్ సీజీఎం వై కె రావుతోపాటు పరిశోధనా సంచాలకులు డా. జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-30T22:29:22+05:30 IST