ఇంటర్నేషనల్ వాకర్స్ జిల్లా డిప్యూటీ గవర్నర్ విక్టర్బాబు
గన్నవరం, మార్చి 27 : నడకతో ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని ఇంటర్నేషనల్ వాకర్స్ జిల్లా డిప్యూటీ గవర్నర్ దేవరపల్లి విక్టర్బాబు అన్నారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణ వాకర్స్ అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా విక్టర్బాబు మాట్లాడుతూ క్రీడా ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం అసోసియేషన్ తరపున కృషి చేయటం అభినందనీయమన్నారు. వాకర్స్ సభ్యులను పెంచుకోవాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మడు పల్లి బాలకృష్ణమూర్తి, కార్యదర్శిగా చిప్పాడ చంద్రశేఖర్, కోశాధికారిగా గంపా సాంబశివరావును ఎన్నుకున్నారు. వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్య క్షుడు ముక్కామల సుబ్బారావు, టీఎ్సఆర్కె ప్రసాద్, చిల్లపల్లి శ్రీనివాసరావు, కెఎన్ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.